బీఎస్ఎఫ్ శిబిరంపై మావోయిస్టుల కాల్పులు

by  |
బీఎస్ఎఫ్ శిబిరంపై మావోయిస్టుల కాల్పులు
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో శనివారం రాత్రి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పి మీడియాకి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో కోయలిబెడా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామ్‌టెరా బీఎస్‌ఎఫ్ క్యాంప్‌ పైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. సమీపంలోని నది ఒడ్డు నుంచి కాల్పులు జరగగా అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్, డీఆర్‌జీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారని తెలిపారు.

సుమారు 30 నిమిషాలపాటు జరిగిన కాల్పుల అనంతరం మావోయిస్టులు చీకటిలో తప్పించుకొని దట్టమైన అడవిలోకి పారిపోయారని వెల్లడించారు. శిబిరంలోని జవాన్లు అందరు సురక్షితంగా ఉన్నారని, మావోయిస్టులకు నష్టం జరిగినట్లుగా భావిస్తున్నామన్నారు. కాల్పుల అనంతరం పరిసర ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.

Next Story