మూడుపూటలా.. కూరగాయలు తినండి : మంజుల

by  |
మూడుపూటలా.. కూరగాయలు తినండి : మంజుల
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కారణంగా సెలెబ్రిటీలంతా ఇంటిపట్టునే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ అభిప్రాయాలు, భావాలను పంచుకునేందుకు చాలా మంది స్టార్స్ యూట్యూబ్ చానల్స్ కూడా ఓపెన్ చేశారు. ఈ క్రమంలోనే.. ‘షో’ మూవీతో న‌టిగా, నిర్మాత‌గా ప్రేక్ష‌కుల‌ను, సినీ వర్గాలను ఆశ్చర్యపరిచిన ‘మంజుల ఘట్టమనేని’ కూడా ఓ యూట్యూబ్ చానల్‌‌తో పాటు తన పేరున వెబ్‌సైట్ కూడా ప్రారంభించింది. ఇప్పటికే తన చానల్ ద్వారా బోలెడన్ని టాపిక్స్‌ డిస్కస్ చేసిన మంజుల.. తాజాగా పచ్చి కూరగాయలు తినాలని చెబుతోంది.

ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా? మెడిటేషన్ ఎలా చేయాలి? మెంటల్ హెల్త్ ప్రికాషన్స్, నవ్వడం వల్ల వచ్చే లాభాలేంటి? ప్రకృతి మనతో మాట్లాడుతుందా? శరీరానికి సరిపడా నీళ్లు తాగుతున్నారా? ఇలా మన ఆరోగ్యానికి సంబంధించి సూపర్ టిప్స్‌తో మంజుల ఘట్టమనేని తన యూట్యూబ్ చానల్‌ను ఆరోగ్యకర వాతావరణంలో ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే.. తాజాగా ‘కూరగాయలు తింటున్నారా?’ అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకుంది. సాధారణంగా.. అందరూ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి లైట్ ఫుడ్ తీసుకుంటారు. అయితే, మంజుల మాత్రం.. మూడు పూటలా కూరగాయలే తింటానని చెబుతోంది . కూరగాయాలు తినడం ఆరోగ్యానికి మంచిదని, వాటిని రొటీన్‌గా కాకుండా ఐదు రకాలుగా తీసుకోమని సలహా ఇస్తోంది.

మార్నింగ్.. సలాడ్‌ రూపంలో తీసుకోవాలని, ఏదైనా నచ్చిన టైమ్‌లో జ్యూస్ చేసుకుని తాగేయాలని చెబుతోంది. ఇంకోసారి ఉడకబెట్టుకొని లేదా కర్రీ చేసుకుని తినాలని సూచిస్తోంది. ఇలా ఎక్కువ వెజ్జీస్ తినడం వల్ల న్యూట్రిషన్స్ పెరుగుతాయని, డైజెషన్ సాఫీగా జరుగుతుందని, ఎముకల సాంద్రత పెరగడంతో పాటు డయాబెటిస్ రిస్క్ తగ్గించుకోవచ్చని చెబుతోంది మంజుల.



Next Story

Most Viewed