ఆందోళనలో మామిడి రైతులు

by  |
ఆందోళనలో మామిడి రైతులు
X

దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రస్తుత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో మామిడి తోటలను సాగు చేస్తున్న రైతులకు నష్టాలు పొంచి ఉన్నట్లు . . వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు . ఓ వైపు వడగండ్ల వానలు రైతులకు కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. కాయ తెంపే దశలో ఆకాల వర్షాలు, ఈదురు గాలులతో మామిడి కాయ రాలి నష్టలు వస్తుంటే, వడగండ్ల వానలతో ఉన్న మామిడి కాయ మరకలు పడి నష్టం వాటిల్లుతోన్నది. దీనికితోడు మామిడి రైతుపై కరోనా కొత్త కష్టాలు తెచ్చి పెడుతోన్నది.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్, పటాన్ చేరు, మెదక్, నర్సాపూర్, రామాయంపేట, సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ ప్రాంతాలల్లో ఇటీవల గత కొంత కాలం నుండి మామిడిపంటపై రైతులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగానే ఆయా మండలాల్లోని పెద్ద గ్రామాలల్లో రైతులు ఇటీవల గత కొంత కాలం నుంచి మామిడి తోటల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పండిన మామిడి కాయలను సదాశివపేట, సంగారెడ్డి, పటాన్చెరు, మెదక్, సిద్ధిపేట, హైదరాబాద్, వరంగల్, మహారాష్ట్ర, నాగ్ పూర్, రామచంద్రాపురం, బిహెచ్ఇఎల్ తదితర ప్రాంతాలకు తరలించి విక్రయించుకునేవారు. లాక్ డౌన్ కారణంగా ఈ సంవత్సరం మాత్రం చేతికొచ్చిన మామిడి పండ్లను ఇతర ప్రదేశాలకు తరలించే అవకాశాలు లేవు. దీంతో మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన మామిడి కాయ కోయడం, ఆమ్మకాలు ఎలా చేయాలాన్న ఆలోచనతో మామిడి రైతులు సతమతమవుతున్నారు. మామిడి రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కాయ కోతకు అనుమతులు ఇవ్వాలని ఆ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags: Mango Farmers, Concerned Conditions, Wetlands, Severe Damage, Government, Corona Effect

Next Story

Most Viewed