ఐదుగురు క్రికెటర్లకు నాడా నోటీసులు

by  |
ఐదుగురు క్రికెటర్లకు నాడా నోటీసులు
X

దిశ, స్పోర్ట్స్: దేశంలో ప్రతి క్రీడాకారుడికి డోపింగ్ పరీక్షలు నిర్వహించే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఐదుగురు క్రికెటర్లకు నోటీసులు జారీ చేసింది. కొన్ని రోజులుగా నాడా పరిధిలో లేకుండా పోవడంతో సదరు క్రికెటర్లకు నోటీసులు ఇస్తున్నట్లు నాడా శనివారం బీసీసీఐకి సమాచారం అందించింది. ఐదుగురు క్రికెటర్లలో ముగ్గురు పురుషుల జట్టుకు చెందినవారు కాగా, మిగిలిన ఇద్దరు మహిళా క్రికెటర్లు కావడం గమనార్హం. ఈ నోటీసులను బీసీసీఐకి నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ పంపారు. సంజాయిషీ ఇవ్వమని కోరారు. నాడా పరిధి నుంచి వెళ్లిన ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంథనా, దీప్తిశర్మలకు నోటీసులు జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. రిపోర్టులు అప్‌లోడ్ చేయడంలో తాము విఫలమయ్యామని, పాస్‌వర్డ్స్ మర్చిపోయినట్లు వాళ్లు పేర్కొన్నట్లు నాడా అధికారి తెలిపారు. కానీ, ఈ విషయంలో నాడా సంతృప్తి చెందలేదు. వెంటనే సంజాయిషీ ఇవ్వాలని బీసీసీఐని కోరింది. ఆటగాళ్లు తాము ఎక్కడ ఉన్నామో తెలుపాలి లేదా నమూనాలను నాడాకు పంపాలి. ఈ రెండు విషయాల్లో పైన పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్లు విఫలం కావడంతోనే నోటీసులు జారీ చేసినట్లు నాడా స్పష్టం చేసింది.



Next Story

Most Viewed