పే స్కేల్ ఇవ్వండి.. వీఆర్ఏ ల వినూత్న నిరసన..

64

దిశ , ఆత్మకూర్ : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మండల వీఆర్ఏలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పే స్కేల్ జీతాలు రావడం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఏ సల్ల రమేష్ కు నివాళులు అర్పించారు. గురువారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ తహసీల్దార్ సురేష్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నామని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ విధులు నిర్వహిస్తున్నామన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు పే స్కేల్ జీతాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల వీఆర్ఏలు పొనుగోటి సతీష్, ఎర్ర శ్రీకాంత్, కంది శిరీష, పాండవుల రవి, జంగా శ్రీకాంత్, నాగవల్లి మాధవి, కంది శోభారాణి, పాండవుల చంద్రమౌళి, మేడ కృష్ణ మూర్తి, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..