వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ

91
Mandha-Krishna-11

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 12 రోజుల క్రితం ప్రేమికుని చేతిలో చెంజర్లలోని దేవునిగుట్ట వద్ద హత్యకు గురైన వరలక్ష్మిని గుర్తించే విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారన్నారు. నిందితుడు అఖిల్ ని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అలాగే వరలక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జిల్లా బోయిని కొమురయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్ చార్జి ఇంజమ్ వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మారంపల్లి శ్రీనివాస్, మాతంగి రమేష్, గోష్కి అజయ్, దండు అంజయ్య, తడగొండ శంకర్, గాలిపల్లి శ్రీనివాస్ పోచంపల్లి సహదేవ్, నవీన్, బెజ్జంకి అనిల్, తాండ్ర నర్సయ్య, కవ్వంపెల్లి రాములు, ఆవునూరి ప్రభాకర్, గుండా థామస్, ఖానాపురం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.