పాత కక్షలతో గొంతుకోసి హత్య  

by  |
పాత కక్షలతో గొంతుకోసి హత్య  
X

దిశ, వెబ్ డెస్క్: పాత కక్షల నేపథ్యంలో యువకుడి గొంతుకోసి హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మనబ్రోలు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కాటూరి ఎలమంద (26) ను.. ఇంకొల్లు మండలం బుధవాడకు చెందిన తాళ్లూరి కోటేశ్వరరావు గురువారం ఉదయం 7 గంటల సమయంలో కత్తితో గొంతు కోసి పారిపోయాడు. హత్యకు గురైన ఎలమంద రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సచివాలయ పోలీస్ సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శశి కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.


Next Story

Most Viewed