కారు టైర్ కింద పైసల నోట్.. తీసుకుందామని ఎంత ట్రై చేసినా..! వీడియో వైరల్

347
Viral-Video11

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఓ వ్యక్తి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు 2.34 లక్షలకు పైగా లైక్‌లతో క్రేజీ వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అక్కడ ఒక కారు ఆగి ఉంది. దాని టైర్ కింద డబ్బుల నోట్ ఉంది. అయితే, ఆ నోట్ ను గమనించి ఓ వ్యక్తి దానిని తీసుకుందామని చాలా ట్రై చేస్తాడు. కానీ, అది పాజిబుల్ కాలేదు. దీంతో మళ్లీ ట్రై చేస్తాడు అయినా పాజిబుల్ కాలేదు. దీంతో అతను ఎదురుగా ఉన్న కేఫ్ కు వెళ్లి దానినే గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత జరిగినదంతా చూస్తే తెగ నవ్వొచ్చేస్తది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.