మోస్రా అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య

by  |
మోస్రా అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా మోస్రా అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు చింతకుంట గ్రామానికి చెందిన గుండ్ల దత్తు (35)గా గుర్తించారు.

బోధన్ ఏసీపీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్ల దత్తు అనే వ్యక్తికి పదేళ్ళ క్రితం పెళ్లయి, ఏడేళ్ల క్రిందట ఇద్దరికి విభేదాలు రావడంతో విడిపోయారు. భార్య విడాకుల అనంతరం దత్తు అదే గ్రామానికి చెందిన స్వరూపతో ఏడేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. మంగళవారం ఉదయం దత్తు హత్యకు గురైన విషయం మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. సహజీవనం చేస్తున్న మహిళనే దత్తును చంపి ఉంటుందని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed