పండుగ రోజు విషాదం.. కాలేజ్ దగ్గరకి వెళ్లగానే..

95
Road-Accide11

దిశ, దామరచర్ల: సంక్రాంతి పండుగ రోజు రోడ్డు ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని బొత్తలపాలెం గ్రామ శివారు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లవాగుతండా గ్రామానికి చెందిన ధీరావత్ హచ్చు నాయక్(55) సంక్రాంతి పండుగ కావడంతో పండుగ సామాగ్రి కోసం దామరచర్లకు బైక్ పై వెళ్తుండగా బొత్తలపాలెం గ్రామ శివారులోని ఐటీఐ కళాశాల దగ్గర వెనుక నుండి అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి, కొద్దిదూరం ఈడ్చుకెళ్లడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వాడపల్లి ఇన్ చార్జ్ ఎస్ఐ వీర శేఖర్ తెలిపారు.