డబుల్ బెడ్ రూంకు పత్రాలు తెమ్మన్న ఆఫీసర్స్.. బాధితుడు మృతి

by  |
డబుల్ బెడ్ రూంకు పత్రాలు తెమ్మన్న ఆఫీసర్స్.. బాధితుడు మృతి
X

దిశ, గజ్వేల్: రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వ్యక్తికి అధికారులు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తానని ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన వడ్డేపల్లి వెంకటేశం(51), ఆయన భార్య నర్మద, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరు ప్రజ్ఞాపూర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి గజ్వేల్ ప్రాంతంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో తనకు ఉన్న ఇంటి స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి వెంకటేశం మానసికంగా అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే అధికారులు వెంకటేశానికి డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇదే విషయంపై పలుమార్లు అధికారులకు తన ఇంటి స్థలం పోయిందని, ఇచ్చిన హామీ ప్రకారం తనకు డబుల్ బెడ్ రూం కేటాయించాలని మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఆవేదనకు గురయ్యారు. గురువారం రోడ్డు విస్తరణ అధికారులు తాను ఉంటున్న అద్దె ఇంటికి వచ్చారు. ఈ సమయంలో తన ఇంటి విషయంపై అధికారులకు మొరపెట్టుకున్నాడు. అయితే.. దీనికి అధికారులు రిప్లై ఇస్తూ గజ్వేల్ లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎవరికీ కేటాయించలేదని, దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అతనికి చెప్పారు. ఇందుకు సంబంధించి అవసరమైన పత్రాలను తీసుకురావాలని వెంకటేశంకు చెప్పడంతో అతను తన వద్ద ఉన్న పత్రాలను అధికారులకు చూపించేందుకు తాను అద్దెకుంటున్న బిల్డింగ్ లోని మొదటి అంతస్తు ఎక్కి కిందకు వచ్చాడు. కిందకి వెళ్లిన వెంకటేశం తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కిందికి వచ్చి చూశారు. వెంకటేశం కుప్పకూలి పడిపోయి ఉండడంతో కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

Next Story

Most Viewed