కిడ్నాపర్లు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు

by  |
కిడ్నాపర్లు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని గాజువాక పోలీసులు ఒక కిడ్నాప్ ఛేదించారు. గాజువాకలో కిడ్నాప్ చేసి, విశాఖడెయిరీ మీదుగా తరలిస్తుండగా పోలీసులు ఆ కారును పట్టుకుని, కిడ్నాపర్‌ను విడిపించారు. అనంతరం కిడ్నాపర్లు చెప్పింది విని, కిడ్నాపైన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… అగస్గ్యన్ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలో చీటింగ్ కేసులో జైలుకి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో జనాలను సులువగా ఎలా మోసం చేయవచ్చే తెలుసుకుని నైపుణ్యాన్ని సంపాదించుకున్నాడు.

కాకినాడలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి సుమారు 50 లక్షల రూపాయలకు పైగా వసూళ్లకు పాల్పడ్డాడు. అతని వసూళ్లకు బలైనవారంతా ఉద్యోగం ఎంతకూ రాకపోవడంతో తమ డబ్బులు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్యోగం నేడు రేపు వస్తుందని చెబుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇలా లాభం లేదని ఉద్యోగాలు వద్దు తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఇచ్చేస్తానని ఏళ్లుగా తిరుగుతున్న ఫలితం ఉండడం లేదు. దీంతో ఎలాగైనా అతని నుంచి డబ్బులు రాబట్టాలని భావించిన బాధితులు అతనిని కిడ్నాప్ చేశారు.

దీంతో తనను కిడ్నాప్ చేశారని, కారులో తీసుకెళ్తున్నారని పోలీసులకు మెసేజ్ పెట్టడంతో ఆఘమేఘాలపై స్పందించిన గాజువాక పోలీసులు విశాఖ డెయిరీ దాటకుండానే పట్టేశారు. కిడ్నాపర్లందర్నీ స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారించగా అగస్త్యన్ అసలు రూపం బయటపడింది. దీంతో అతని గత చరిత్రపై దృష్టిసారించగా, గతంలో ఒకసారి ఛీటింగ్ కేసులో జైలు కెళ్లినట్టు తెలిసింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.



Next Story