నేషనల్ పాలిటిక్స్‌పై మమత నజర్

by  |
నేషనల్ పాలిటిక్స్‌పై మమత నజర్
X

బెంగాల్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయం నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీ జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించారు. ఈ మేరకు మమత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నారు. టీఎంసీలో ఒక నేత, ఒక పోస్టు విధానాన్ని అమలు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జిల్లాస్థాయిలో పార్టీని పునర్నిర్మాణం చేయాలని కూడా భావిస్తున్నారు. పార్టీకి విధేయులై ఉండి, అహరహం శ్రమించే కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. జాతీయ రాజకీయాలలో ఎలాంటి వ్యూహాలను అమలుపరచాలో కూడా సుదీర్ఘంగా చర్చించారు. మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

Next Story