టిక్‌టాక్‌ తరహాలోనే యాప్‌ తయారీ..!

by  |
టిక్‌టాక్‌ తరహాలోనే యాప్‌ తయారీ..!
X

దిశ, తాండూరు: చైనా టిక్‌టాక్‌ను తలదన్నేలా ‘పాప్‌కార్న్’ అనే షార్ట్ వీడియో యాప్‌ను వికారాబాద్ జిల్లావాసి రూపొందించాడు. వివరాల్లోకి వెళ్తే.. కొటాలగూడ గ్రామానికి చెందిన రాంచందర్ అనే వ్యక్తి.. బీ.ఎడ్ పూర్తి చేసి మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఏదైనా సాధించాలనే తపనతో పాప్‎కార్న్ అనే నూతన యాప్‎ను తయారుచేశాడు. అలాగే వస్తువులను డెలివరీ చేసేందకు గానూ, ఫ్లిప్‎కార్ట్, అమెజాన్ తరహాలో ‘exlentmart.in‘ అనే వెబ్‎సైట్‎ను సైతం ప్రారంభించారు. దీంతో జిల్లాలో 18 మండలాలలకు డెలివరీ ఒక్కరోజులోనే అందే విధంగా రూపొందించాడు.

ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ.. చైనా, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో నేపథ్యంలో టిక్‎టాక్ యాప్ బ్యాన్ చేశారు. ఆత్మ నిర్మల్ భారత్‎లో భాగంగా కొత్త యాప్ తయారు చేయాలనే ఉద్దేశ్యంతో నూతన యాప్‎ను రూపొందించామని తెలిపారు. పాప్‌కార్న్ షార్ట్ వీడియో యాప్ ప్రస్తుతం యాప్ ప్లే‎స్టోర్‌లో అందుబాటులో ఉందన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి యాప్‌ను రూపొందించడంతో పలువురు అభినందిస్తున్నారు.



Next Story