మాస్క్ లు తయారు చేయండి.. సహాయ పడండి!

by  |
మాస్క్ లు తయారు చేయండి.. సహాయ పడండి!
X

దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి వైద్యులు మొదలు కొని.. సామాన్యుల వరకు అందరూ మాస్క్ ల కోసం పరుగులు పెడుతున్నారు. మొదట అందరూ ‘ఎన్ 95’ మాస్క్ లు కొనుగోలు చేశారు. ఒక్కసారిగా వాటి కొరత ఏర్పడింది. తెలంగాణలో ఎన్ 95 మాస్క్ ఉత్పత్తి చేసే సంస్థలు లేవు. ఈ మాస్కుల ముడి సరుకు చైనా నుంచి దిగుమతి అయ్యేది. చైనాలో కరోనా ప్రభావంతో దిగుమతులను నిలిపివేయడంతో మాస్కుల తయారీకి అడ్డంకులు ఏర్పడ్డాయి. దాంతో దేశంలో ఎక్కడా కూడా ఆ మాస్క్ లు దొరకని పరిస్థితి ఏర్పడింది. అవి దొరకకపోవడంతో.. ప్రజలందరూ సాధారణ మాస్క్ లను కోనుగోలు చేయడానికి మొగ్గు చూపారు. ప్రస్తుతం అవి కూడా లభించని పరిస్థితి మన రాష్ర్టంలో ఉంది. మరి మాస్క్ లను తయారు చేయడం ఎలా?

కరోనా గడగడలాడిస్తున్న వేళ… మాస్క్ ఉంటేనే బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించిన దాని కంటే.. శరీర భాగాలను తాకడం ద్వారా.. తుంపర్ల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. దీన్ని నిరోధించాలంటే.. వ్యక్తిగత శుభ్రతతో పాటు.. మాస్క్ లు కూడా విధిగా ధరించాలి. దీంతో ఒక్కసారిగా మాస్క్‌లకు డిమాండ్ పెరిగింది.. కొరత ఏర్పడింది. హైదరాబాద్‌తో మరికొన్ని నగరాల్లో ఇదే సమస్య వెంటాడుతోంది. మెడికల్ షాపుల్లో మాస్క్‌లు దొరకని పరిస్థితి. మాస్క్‌లు కొరతతో జనాలు కాస్త ఇబ్బందిపడుతున్నారు. రాష్ర్ట మంతటా మాస్క్ ల కొరత వెంటాడుతోంది. మాస్క్ ల కొరత ఉన్న కారణంగా ఇంట్లో ఖాళాగా ఉన్న వాళ్లు, ఈ సమాజానికి , తోటి మనుషులకు సాయం చేయాలని భావించే వాళ్లు.. మాస్క్ లు తయారుచేసి తమ ఔదార్యాన్ని చాటవచ్చు. లేదంటే దాన్నే ఆదాయ మార్గంగానూ మలుచుకోవచ్చు.

క్లాత్ మాస్క్ లు చేస్తే :

మార్కెట్ లో దొరికే కొన్ని మాస్క్ లు కేవలం ఒక రోజు మాత్రమే పనిచేస్తాయి. కానీ క్లాత్ తో తయారు చేస్తే అవి వాష్ చేసుకుని మళ్లీ వాడుకోవచ్చు. సబ్బు, డెటాల్ తో ఉతుక్కుంటే సరిపోతుంది. వీటికి కావాల్సింది క్లాత్ , ఎలస్టిక్ దొరికితే చాలు. ఎలస్టిక్ లేకపోయినా.. క్లాత్ తోనే ముడి వేసేకునేలా తయారు చేయవచ్చు. చిన్న పిల్లలకు కుల్లలు కుట్టినట్లు కుడితే సరిపోతుంది.

ఆదాయం, ఔదార్యం :

లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు. చాలా మందికి పనులు లేకపోవడంతో ఆదాయం కూడా రావడం లేదు. పని చేసేందుకు ఎలాంటి మార్గం కూడా లేదు. అన్ని సంస్థలు కూడా షట్ డౌన్ అయ్యాయి. ఇంటి దగ్గర ఖాళీ ఉండలేక, ఆదాయం లేక చాలా మంది సతమతమవుతున్నారు. అయితే.. విపత్తు తెచ్చిన కరోనానే మరో ఆదాయ మార్గాన్ని సూచిస్తుంది. మాస్క్ ల తయారీతో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన రాష్ర్టంలో .. దేశంలో కొన్ని లక్షల మాస్క్ లు అవసరం ఉన్నాయి. అందువల్ల మాస్క్ లు చేయడం వల్ల నష్టపోయేది కూడా ఏం లేదు. మన రాష్ట్రంలో నే కాకుండ పక్క రాష్ట్రాల్లోనూ వీటిని అమ్ముకోవచ్చు. సేవా భావం ఉన్న వాళ్లు .. మాస్క్ ల అవసరం ఉన్నవాళ్లకు ఉచితంగా అందించవచ్చు. ఇప్పటికే ఎన్నో సేవా సంస్థలతో పాటు, మానవత్వం ఉన్నవాల్లు ఫ్రీ గా మాస్క్ లు పంచుతున్నారు. పలు జైల్లలోని ఖైదీలు కూడా మాస్క్ ల తయారీ చేస్తున్నారు. వాటిని చిన్నారులకు, వృద్ధులకు, మహిళలకు అందిస్తున్నారు.

టిష్యూతో ఇన్స్టంట్ మాస్క్ :

మన ఇంట్లో టిష్యూ పేపర్ ఉంటే చాలు.. మాస్క్ తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఏమీ ఆయాసపడనవసరం లేదు.. ఒక టిష్యూ, రెండు రబ్బర్ రబ్బర్లు, నాలుగు పిన్నులతో చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా యూట్యూట్ లో అందుబాటులో ఉంది.

Tags : mask, tissue, coronavirus, n95, free, service, money, employment

Next Story

Most Viewed