‘కోవిడ్ సంబంధిత కొనుగోళ్లను బహిర్గతం చేయాలి’

by  |
‘కోవిడ్ సంబంధిత కొనుగోళ్లను బహిర్గతం చేయాలి’
X

న్యూఢిల్లీ: కోవిడ్-19పై పోరాటంలో భాగంగా గతనెలలో చేసిన అన్ని కొనుగోళ్ల వివరాలను కేంద్రప్రభుత్వం బహిర్గతం చేయాలని కాంగ్రెస్ సోమవారం డిమాండ్ చేసింది. ఇలాంటి సంక్షోభ సమయంలో పలువురు భారీ లాభాలను ఆర్జిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధి మనీశ్ తివారి మాట్లాడుతూ.. ‘కరోనా కట్టడికి కొనుగోలు చేసిన టెస్టింగ్ కిట్లు, పీపీఈలు, వెంటిలేటర్లు, వాటి రవాణాకు అయిన ఖర్చుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెంటనే వెల్లడించాలి. కరోనా కట్టడికి జరుపుతున్న అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉండాలి’ అని డిమాండ్ చేశారు. టెస్టింగ్ కిట్లు సరఫరా చేసే ఓ సంస్థ గురించి ప్రస్తావిస్తూ.. రూ.245లకు ఒకటి చొప్పున కొనుగోలు చేసిన కిట్లను ఐసీఎంఆర్‌కు రూ.600 చొప్పున విక్రయిస్తుండగా, తమిళనాడు ప్రభుత్వానికి మాత్రం రూ.400చొప్పున అమ్ముతోందని ఆరోపించారు. ఈ విషయం సదరు సంస్థ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో వెలుగు చూసిందని తెలిపారు. కావున కరోనా సంబంధిత పరికరాల సేకరణలో కంపెనీలు భారీ లాభాలు ఆర్జించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags: congress, Make Details corona Related Purchases, icmr, manish tewari, corona, virus,

Next Story