మారేడుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములుగా గుర్తించిన పోలీసులు..

by  |
roadaccident
X

దిశ, ఏపీ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులను పోలీసులు రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న రంపచోడవరం పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు చింతూరుకు చెందిన గణేష్, సాయిగా నిర్ధారించారు. ఇద్దరు అన్నదమ్ములని పోలీసుల విచారణలో తేలింది. ఇకపోతే క్షతగాత్రులు రాజమండ్రికి చెందిన కొనుతుల వెంకట గణేష్, ఐ.పోలవరంకు చెందిన ముర్రం సత్తిబాబుగా గుర్తించారు. రాజమహేంద్రవరం నుండి చింతూరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇకపోతే మృతుడు గణేష్ రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్లో ఆర్థోపెడిక్ వద్ద సహాయకునిగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story