10-15 శాతం వంటనూనెల ధరలు తగ్గించిన కంపెనీలు!

by  |
10-15 శాతం వంటనూనెల ధరలు తగ్గించిన కంపెనీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఏడాది రాబోతున్న వేళ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ.. దేశవ్యాప్తంగా ప్రధాన కంపెనీలన్నీ వంటనూనె ఉత్పత్తుల ధరలు తగ్గించాయి. వంటనూనె ఎంఆర్‌పీ ధరలపై 10-15 శాతం తగ్గించాయని పరిశ్రమల సంస్థ సాలెవెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వంటనూనెల పై ధరల తగ్గింపునకు కంపెనీలన్నీ సానుకూలంగా స్పందించాయి. ఎంఆర్‌పీపై 10-15 శాతం తగ్గించేందుకు ముందుకురావడం సంతోషంగా ఉందని ఎస్ఈఏ పేర్కొంది. ధరలు తగ్గించిన కంపెనీల జాబితాలో అదానీ విల్‌మర్, రుచి సోయ, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెలా బ్రాండ్స్, ఇమామి, జెమిని, గోకుల్ ఆగ్రో సహా ఇంకా ఇతర బ్రాండ్‌లు ధరలు తగ్గించాయని పరిశ్రమ సంస్థ వివరించింది.

ఇటీవల కేంద్రం రిఫైన్‌డ్ పామాయిల్‌పై కస్టమ్స్ డ్యూటీని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2022, డిసెంబర్ వరకు లైసెన్స్ లేకుండానే రిఫైన్‌డ్ పామాయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం వ్యాపారులకు అనుమతించింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి ప్రధాన కంపెనీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయా కంపెనీలు వంటనూనెల ధరలను తగ్గించాయి.



Next Story

Most Viewed