SC మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

by  |
SC మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
X

దిశ, మణుగూరు : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ మాదిగలకు 12% శాతం రిజర్వేషన్లు కల్పించాలని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చలో- ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు-పోస్టర్లను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాదిగ జేఏసీ కార్యదర్శి, అధ్యక్షులు మాట్లాడుతూ.. మాదిగలకు 12% శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యంతో డిసెంబర్ 13, 14 తేదీల్లో ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద రెండు రోజుల పాటు జరిగే నిరసన దీక్ష- మహాసభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డా.పిడమర్తి రవి నేతృత్వంలో చలో-ఢిల్లీ జంతర్-మంతర్ నిరసన దీక్ష-మహాసభ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ అసెంబ్లీ అధ్యక్షుడు గంగారపు రమేష్, నియోజకవర్గ కో-కన్వీనర్ గోవింద శ్రీను, మండల అధ్యక్షుడు రావులపల్లి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ యువజన నాయుకులు రుద్ర వెంకట్, గుర్రం సృజన్, పొడుతూరి విక్రమ్, బోయిళ్ళ రాజు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed