పేద విద్యార్థులకు పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య : మధ్యప్రదేశ్

by  |
పేద విద్యార్థులకు పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య : మధ్యప్రదేశ్
X

భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదర్శనీయమైన ముందడుగు వేసింది. రాష్ట్రంలోని పేద పిల్లల చదువులకయ్యే ఖర్చులను భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సాంబల్ స్కీమ్ కింద పేద కుటుంబాల పిల్లలకు 1వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అయ్యే విద్యా ఖర్చులను భరించనున్నట్టు బీజేపీ నేత జ్యోతిరాదిత్యా సింధియా వెల్లడించారు. ప్రైవేటు కాలేజీల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే వెచ్చిస్తుందని చెప్పారు.

అయితే, పేదలు తమ పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించాలని ఆయన ట్వీట్ చేశారు. సమాజంలోని అన్ని నిరుపేద వర్గాలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకాన్ని నేడు మళ్లీ ప్రారంభించారని సింధియా పేర్కొన్నారు. ఈ స్కీమ్‌కు సూపర్–5000 అనే మరో పథకాన్ని జత చేస్తున్నామని తెలిపారు. తద్వారా క్లాస్–12లో అత్యధిక మార్కులు సాధించిన పేద పిల్లలకు అదనంగా రూ.30 వేలు ఇస్తామని వెల్లడించారు. ఈ సాంబల్ పథకాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్.. మంగళవారం పున:ప్రారంభించారు. అదే రోజు రూ. 1,863 కోట్లను ఈ స్కీమ్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

tags: sambal scheme, madhya pradesh, free education, shivraj singh chauhan

Next Story