మదనపల్లె జంట హత్యల కేసు : తీగలాగుతున్న వకీల్ సాబ్

by  |
మదనపల్లె జంట హత్యల కేసు : తీగలాగుతున్న వకీల్ సాబ్
X

దిశ,వెబ్‌డెస్క్:చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులైన పద్మజ,పురుషోత్తమనాయుడులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులైన పద్మజ, పురుషోత్తమనాయుడు తమ పిల్లలైన సాయిదివ్య, అలేఖ్య హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే పేగు బంధాన్ని మరచిన ఆ కసాయి తల్లిదండ్రులు పిల్లల్ని హత్య చేసినా..వాళ్లు హత్య చేసేలా ఎవరో ప్రేరేపించారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. సీసీటీవీఫుటేజ్, కాల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్స్ గురించి పోలీసులు ఇంతవరకూ స్పష్టత ఇవ్వలేదు.దీంతో పాటు పద్మజ, పురుషోత్తమనాయుడుల వందల కోట్ల ఆస్తిని కాజేందుకు ఎవరైనా కుట్రపన్నారా..?క్షుద్రపూజలు ఎవరు చేశారు..? ఎవరు చేయించారు..? ఇలాంటి ప్రశ్నల పరంపర కొనసాగుతుంది.
దీన్ని ఛేదించేందుకు తమగురువులైన పద్మజ,పురుషోత్తం నాయుడుల తరుపు వాదించాలంటూ వందలాది మంది పూర్వ విద్యార్ధులు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కృష్ణమాచార్యతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాల్ని తెలుసుకునేందుకు కృష్ణమాచార్య తన జూనియర్ లాయరైన రజినినీ మదనపల్లె సబ్‌జైలులో ఉన్న నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడులను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ జైలు అధికారులు సోమవారం రావాలంటూ తనకు చెప్పినట్లు రజిని తెలిపింది. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ ఈ హత్యకు సంబంధించి అనేక అనుమానాలున్నాయి. నిందితుల్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోమవారం నిందితులతో మాట్లాడిడే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ప్రస్తుతం హత్యకు గురైన బాధితుల గురించి తెలుసుకుంటున్నట్లు చెప్పారు.

Next Story

Most Viewed