వలస కార్మికులకు సాయం అభినందనీయం : గౌతంరెడ్డి

by  |
వలస కార్మికులకు సాయం అభినందనీయం : గౌతంరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా సమయంలో వలస కూలీలకు సాయం అందించడం అభినందనీయమని మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి అన్నారు. శుక్రవారం మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఏఎస్ పేట దర్గాను ఆయన దర్శించారు. దర్గా అంటే మొదటి నుంచీ తనకు ప్రత్యేకమైన భావన ఉండేదని మంత్రి పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల కోసం మౌలిక వసతులను మరింత పెంచి దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని మేకపాటి హామీ ఇచ్చారు.

గాంధీ సెంటర్‌లో రూ.10 లక్షలతో బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేయిస్తామన్నారు. తొలుత మంత్రి మేకపాటికి దర్గాకు చెందిన ముస్లిం సోదరులు ఘనస్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వలస కార్మికులకు దర్గా, వక్ఫ్ బోర్డు అందించిన వసతి, భోజన సహకారాలపై మంత్రి మేకపాటి ప్రత్యేకంగా అభినందించారు. దర్గాను దర్శించుకున్న వారిలో మంత్రితో పాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కూడా ఉన్నారు.


Next Story

Most Viewed