రియల్ ఎస్టేట్ రంగాన్ని వెంటాడుతున్న కష్టాలు!

by  |
రియల్ ఎస్టేట్ రంగాన్ని వెంటాడుతున్న కష్టాలు!
X

గత మూడేళ్లుగా మందగమనంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో కొవిడ్-19 మరింత ఒత్తిడి పెంచిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 2021 ఆర్థిక సంవత్సరం వరకూ లగ్జరీ హౌసింగ్‌తో పాటు మొత్తం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం అత్యధికంగా ఉంటుందని హౌసింగ్ డాట్ కామ్ సీఈవో ధృవ్ అగర్వాల్ చెప్పారు. నోట్ల రద్దు తర్వాత గృహాల కొనుగోళ్లకు డిమాండ్ తగ్గిపోయిందని, కరోనా వైరస్ విపత్తు కారణంగా మరింత దారుణంగా పరిస్థితులు ఉండనున్నట్టు ఈ రంగంలోని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియాలో ఉన్నమాంద్యం కారణంగా రియల్టీ మార్కెట్లోని లగ్జరీ గృహాలకు డిమాండ్ పూర్తీగా పడిపోయిందని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో ప్రారంభమైన లగ్జరీ గృహాల్లో సగానికిపైగా యూనిట్లు విక్రయం జరగక నిలిచిపోయాయన్ని నివేదిక చెబుతోంది. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లోని గృహ యూనిట్లను పరిశోధనకు పరిగణించారు. హౌసింగ్ డాట్ కామ్, ఇతర అనుబంధ రియల్ ఎస్టేట్ పోర్టల్ గణాంకాల ప్రకారం..2018లో 29,996 లగ్జరీ యూనిట్లు ప్రారంభిస్తే 2019లో వాటి సంఖ్య 29,775 యూనిట్లుగా ఉన్నాయి. అంటే, కేవలం 221 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల విలువైన గృహాలు 4,762 యూనిట్లు, రూ. 5 నుంచి రూ. 7 కోట్లు విలువైన గృహాలు 2,025 యూనిట్లు, రూ. 7 కోట్లు దాటిన లగ్జరీ గృహాలు 577 యూనిట్లు అమ్ముడుపోక అలాగే ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. రూ. 3 నుంచి రూ. 5 కోట్ల విలువ యూనిట్లలో సుమారు 56 శాతం యూనిట్ల విక్రయం జరగలేదు.

Tags : real estate, luxery houses, house saling


Next Story