మిడ్చిల్‌లో ఒక్కటైన ప్రేమజంట.. కానీ!

by  |
lovers midgil
X

దిశ, జడ్చర్ల : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ప్రేమికులు పెద్దలను ఎదురించి ఎట్టకేలకు ఒక్కటయ్యారు. అయితే, వారిని విడగొట్టేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. దీంతో ఇరు కుటుంబాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ మిడ్జిల్ పోలీసులను ఆశ్రయించారు నవ దంపతులు. వివరాల్లోకివెళితే.. మండల పరిధిలోని వెలుగోముల గ్రామానికి చెందిన ముత్యాల కృష్ణ ప్రసాద్, ఊరుకొండ మండలం బొమ్మరాశి పల్లి గ్రామానికి చెందిన గంగాపురం పూజ ఇద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు.

ఇరువురు ఒకే కులానికి చెందిన వారైనా ఇరు కుటుంబసభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇరువురు మేజర్లు కావడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఓ దేవాలయంలో పెళ్లి చేసుకొని ఆదివారం తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ మిడ్జిల్ మండల కేంద్రంలోని పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన స్థానిక ట్రైనీ ఎస్సై మన్మోహన్ గౌడ్ ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరూ మేజర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం నవ దంపతులకు భరోసా ఇచ్చి పంపించారు.

Next Story

Most Viewed