ఎవరికేం కావాలో అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటా.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
Congress MLA Jagga Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలంటే నీలం మధు ముదిరాజ్‌ను గెలిపించాలని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి ఓటర్లను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రిక్వెస్ట్ చేశారు. శనివారం నర్సాపూర్ నియోజకవర్గంలో శ‌నివారం విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సదర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లు మనతో వాళ్లు ఆడుకున్నారు.. ఈ ఐదేళ్లు మనం వారితో ఆడుకుందామని కీలక పిలుపునిచ్చారు. కాంగ్రె‌స్‌ మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకున్నట్టుగానే కాంగ్రెస్‌ పాలన ఉంటుందని, నిరుత్సాహపడవద్దన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు హామీల్లో ఇప్పటికే ఐదింటిని అమలు చేశామని చెప్పారు.

వంద రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200యూనిట్ల మేర ఉచిత విద్యుత్తుతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు పెంచామన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను నంబర్‌ వన్‌గా నిలపాలని ప్రజలను కోరారు. ఇక్కడి నుంచి కాంగ్రె‌స్‌కు 20 వేల ఓట్ల మెజార్టీ ఇస్తే నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ జరుగుతాయన్నారు. స్థానిక నేతలు చెబుతున్నట్లుగా 50వేల ఓట్ల మెజార్టీ ఇస్తే నియోజకవర్గానికి ఏం కావాలో తానే దగ్గరుండి చేయిస్తానని హామీ ఇచ్చారు. వడ్డీలేని రుణాలను అందించి పేదలను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Read More..

ఎన్నికల్లో కూతురు పోటీపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్.. కనీసం నువ్వైనా సిద్ధం కావాలంటూ పార్టీ నేత కూతురికి సూచనNext Story

Most Viewed