టికెట్ల ధరలు నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది: లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి 

by srinivas |   ( Updated:2021-12-24 06:31:48.0  )
lakshman reddy
X

దిశ, ఏపీ బ్యూరో: టికెట్ల ధరలు నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇష్టారీతిన టికెట్లు పెంచుకునే అధికారం ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టులు జీవో 35 ను కొట్టేసినా.. ప్రజా ప్రయోజనాలే పరిగణనలోకి తీసుకుంటాయని అందులో సందేహం లేదన్నారు. థియేటర్లకు వెళ్లేది దిగువ తరగతి వాళ్లేనని అందువల్ల వాళ్లని పరిగణలోకి తీసుకుని కచ్చితంగా టికెట్ ధరలు నియంత్రణలో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరి కోసం భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారని నిలదీశారు. సినిమా ప్రొడక్షన్ ఖర్చు నియంత్రించుకోవాలే తప్ప టికెట్ ధరల తగ్గింపు పై అనవసర రాద్ధాంతం సరికాదని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed