రాహుల్ గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం

by  |
రాహుల్ గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం
X

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభ సమావేశాలు శుక్రవారం వాడీవేడిగా సాగాయి. లడాఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి, పెట్రోల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్, టీఎన్ ప్రతాపన్‌లు వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం నోటీసు ప్రవేశపెట్టారు. గురువారం చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ తన పరిధిని అతిక్రమించారని, సభా మర్యాదలను ఉల్లంఘించాడని పేర్కొన్నారు.

గందరగోళ పరిస్థితుల మధ్యనే ఆర్బిట్రేషన్, కాన్సిలేషన్(సవరణ)-2021 బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. స్పీకర్ ఓంబిర్లా సభను శనివారం ఉదయం 10గంటలకు వాయిదా వేశారు. బడ్జెట్‌పై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వనున్నారు. రాజ్యసభ వచ్చే నెల 8వ తేదీకి వాయిదా పడింది. ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. లోక్‌సభలో శనివారం ముఖ్యమైన అంశాలపై చర్చ జరగడంతో బిల్లులను పాస్ చేసుకోవాల్సి ఉండటంతో సభ్యులు అందరూ హాజరు కావాలని ఆదేశించింది.

Next Story

Most Viewed