రైళ్లు నడుస్తున్నాయి..

by  |
రైళ్లు నడుస్తున్నాయి..
X

దిశ, వెబ్ డెస్క్: ముంబైలో లోకల్ రైళ్ల సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే వాటిని అత్యవసర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే అని పశ్చిమ రైల్వే పేర్కొన్నది. వీటిలో ప్రయాణించేందుకు సాధారణ ప్రయాణికులకు అనుమతి లేదని తెలిపింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అత్యవసర విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం నేటి నుంచి కొన్ని సబర్బన్ రైళ్లను నడపాలని పశ్చిమ రైల్వే నిర్ణయించిందని రైల్వేశాఖ ట్వీట్టర్ లో పేర్కొన్నది. ఈ రైళ్లు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల మధ్య ప్రతి 15 నిమిషాలకొక రైలు చొప్పున నడవనున్నాయి. ఈ నేపథ్యంలో విరార్ నుంచి చర్చిగేట్ మధ్య మొదటి రైలు ప్రయాణించింది. స్టేషన్ కు వచ్చేవారు తప్పకుండా ఐడీ కార్డు చూపించాల్సి ఉంటదని అధికారులు పేర్కొన్నారు.

Next Story