లోన్ రికవరీ కోసం బస్సు ‘హైజాక్’

by  |
లోన్ రికవరీ కోసం బస్సు ‘హైజాక్’
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలో వింత ఘటన చోటుచేసుకుంది. లోన్ రికవరీ చేయడానికి కొందరు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని పన్నాకు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకుని, డ్రైవర్, కండక్టర్లను దింపేశారు. 34 మందితో ఉన్న ఆ బస్సును మరో చోటుకు తీసుకెళ్లారు. ఈ ఘటన బుధవారం ఉదయం ఆగ్రాలో కలకలం రేపింది. బస్సు డ్రైవర్, కండక్టర్‌లు పోలీసు స్టేషన్ వచ్చారని, బస్సు ఫైనాన్సర్‌లపనే అయివుంటుందని ఆగ్రా పోలీసు చీఫ్ బబ్లూ కుమార్ తెలిపారు.

డబ్బు వ్యవహారంలో ఇటీవలే కొందరు తమ ఇంటికి కొంతమంది వచ్చారని బస్సు యజమానులు తెలిపినట్టు చెప్పారు. దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. ఆ ఖాళీ బస్సు యూపీ ఎటావా జిల్లాలో లభించింది. రికవరీ ఏజెంట్లు బస్సులో ప్రయాణికులను కొన్ని కిలోమీటర్లు తీసుకెళ్లి మరో బస్సులో ఎక్కించారని, ఆ బస్సు వారిని ఝాన్సీ జిల్లా వరకు తీసుకెళ్లి వదిలిపెట్టిందని ప్రయాణికులు తెలిపారు.

Next Story

Most Viewed