వారు వ్యాక్సిన్ తీసుకోకుంటే ప్రాణాలకే ముప్పు

213

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: క‌రోనా నేప‌థ్యంలో కాలేయ వ్యాధిగ్రస్తులు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా? ఒక‌వేళ తీసుకుంటే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయా? తీసుకోక‌పోతే ఏమౌతుంది? అనేది ప్రస్తుతం చాలా మంది రోగుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. క‌రోనా వ్యాధి ప్రధానంగా కాలేయంపై ప్రభావం చూపుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పే వాటిల్లే అవ‌కాశం లేక పోలేదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ప్యాటీ లివ‌ర్‌, లివ‌ర్ సిర్రోసిస్ వంటి స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న వ్యక్తులపై కొవిడ్ -19 వ్యాక్సిన్ అనుకూల‌ లేదా ప్రతికూల ప్రభావం చూపుతుంద‌న‌డానికి స‌రియైన ఆధారాలు లేక‌పోయిన‌ప్పటికీ డాక్టర్ల పర్యవేక్షణలో వ్యాక్సిన్ తీసుకోవడం మేలు.

నిపుణుల సంరక్షణ‌లో..

దేశంలోని ఆస్ట్రాజెనికా అసోసియేషన్‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వవిద్యాల‌యం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను, మోడరానాలోని ఫైజర్ + బయో ఎన్ టెక్ నిర్వహించిన ట్రయల్స్ అన్నీ విజ‌య‌వంత‌మయ్యాయి. కాలేయ వ్యాధులతో బాధ‌ప‌డే రోగుల‌పై వ్యాక్సిన్ ఏ విధంగా ప్రభావం చూపుతుంద‌న‌డానికి ఇంకా ప్రయోగాలు జ‌రుగుతున్నాయి. కానీ, ఇప్పటి వ‌ర‌కు వెలుబ‌డిన ఫ‌లితాల ప్రకారం కాలేయ రోగులకు నిపుణుల సంరక్షణలో వ్యాక్సిన్ ఇవ్వడం మంచిద‌నే అభిప్రాయాన్ని ప‌లువురు డాక్టర్లు వెల్లడించారు.

క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవాలి..

కాలేయ సంబంధిత వ్యాధుల‌తో బాధ‌పప‌డేవారికి క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవస‌రం ఎంతైనా ఉంది. వారికి రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డంతో కొంత సున్నితంగా ఉంటారు. క‌రోనా వైర‌స్ దాడిని నిరోధించే శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డంతో మ‌హ‌మ్మారి వేగంగా, సుల‌భంగా సంక్రమించే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాల‌ను నియంత్రించాలంటే కొవిడ్ -19 టీకాను తీసుకుంటేనే మంచిది. టీకా తీసుకునే ముందు, త‌ర్వాత డాక్టర్ల ప‌ర్యవేక్షణ‌లో ఉండాలి.
–డాక్టర్ రాఘ‌వేంద్రబాబు, సీనియ‌ర్ లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జన్, గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్స్

వైరస్​ నుంచి రక్షణ..

కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రోగుల‌తో పాటుగా స‌ర్జరీకి ముందు యాంటీ బ‌యోటిక్ మందులు వాడుతున్న వారు కూడా కొవిడ్ -19 వ్యాక్సిన్‌ను తీసుకోవ‌చ్చు. సంవ‌త్సర కాలంగా యావ‌త్ ప్రపంచాన్ని కుదిపేసినా క‌రోనా వైర‌స్‌నుంచి ర‌క్షణ‌కు వ్యాక్సిన్ ఎంతో అవ‌స‌రం. కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్నవారు, కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకోవాల‌నుకున్న వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
–డాక్టర్ చంద‌న్, ప్రముఖ లివ‌ర్ ఫిజీషియ‌న్

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..