సమీక్ష: స్మశానావరణం సాక్షిగా!

by Disha edit |
సమీక్ష: స్మశానావరణం సాక్షిగా!
X

ళ్లు విస్తరించాల్సిన చోట స్మశానాలు విలసిల్లుతున్నాయి. పూటకో కొత్త సమాధితో ఇపుడు దింపుడు కల్లం పులకరిస్తున్నదం'టూ సమాజంలో జరుగుతున్న వాస్తవాన్ని మన కళ్ళముందు ఉంచారు పసునూరి రవీందర్ 'స్మశానావరణం సాక్షిగా' కవిత ద్వారా. కరోనా నేపథ్యంలో చనిపోయిన లక్షల మందిని, వారి కుటుంబాలను ఉద్దేశిస్తూ ప్రజలు ఎంతో బాధాకరమైన స్థితిని ఎదుర్కొన్నారని, వారిని ఎక్కువసేపు ఇంటి ముందు ఉంచలేదని, తొందరగా స్మశానానికి తరలించారని, అప్పుడు అక్కడ జరిగే దింపుడుకల్లం సరిగ్గా జరగలేదని ఆ సమయంలో దింపుడుకల్లం పులకరిస్తున్నదని వ్యక్తికరించారు.

అయితే, స్మశానావరణంపై పసనూరి రాసిన కవితలో ఏం ఉందని ఆశ్చర్యం కలగవచ్చు. ఇందులో ఒక వ్యక్తి చనిపోతే వారి కుటుంబాల బాధను, మనుషులు చనిపోతే ఆ ఊరిలో తప్పుతున్న కళను, శవాన్ని దహానం చేస్తే వచ్చే వెలుగును స్మశానం కాంతులీనుతోందని సూర్యకాంతి లాగా వెలుగుతోందని వ్యక్తీకరించారు. అలాగే అక్కడ ఉన్న పాడె కట్టెలు, పగిలిన కుండలు, పాత బట్టలను మామిడి తోరణాలే వలె ఉన్నాయని భావనాత్మకంగా తెలియజేశారు. ఇవన్నీ చూస్తే ఆయన కరోనా మరణాలను అకాల మరణాల బుతువు అనడం, వల్లకాడు దినదినాభివృద్ధి చెందుతోందనడం అక్షరాల నిజమనిపిస్తోంది. చనిపోయిన వ్యక్తి ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయిన తర్వాత కొంపలు ఖాళీ అవడంపై పసనూరి బొందలు రాజ్యమేలుతున్నాయి అని చక్కగా వ్యక్తీకరించారు. అలాగే పాలకులు స్మశానాలే అభివృద్ధి చేస్తున్నారని వారికి ఓటేసిన ప్రజల అర్థాకలితో జీవనం సాగించి స్మశానాలకు చేరుతున్నారని, ఇప్పుడు ఆత్మీయులను తలచుకునేందుకు ఊరికి కాదు నేరుగా స్మశానానికి వెళ్లాలని వ్యగ్యంగా వ్యక్తీకరించారు. అలాగే పండిన పండు నేలరాలడం మట్టిలో కలవడం ప్రకృతి ధర్మం, మరి పసి మొగ్గలు స్మశానానికి చేరడం ఏమి న్యాయమని ప్రశ్నించాడు.

కవి పసునూరి సమాజాన్ని ఔపోసన పట్టినవాడు. సమాజ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నవాడు. దళారులు, దోపిడీదారులు వారి తాబేదార్లు ప్రజల శ్రమను దోపిడీ చేస్తున్న స్థితిని ఎరిగినవారు. కాబట్టి పండు టాకులకు మెతుకులు లేవు, పసి మొగ్గలకు నూకలైనా లేవు, ఇక స్మశానాలు విస్తరించకుంటే ఊరువాడలు విస్తరిస్తాయా? సమాజ వాస్తవ స్థితిని కళ్ళకు కట్టినట్లు చెబుతూ సమాధానం చక్కగా అందించారు. రాజ్యం ఎప్పుడు ఇంతే, ఉరితాళ్లు పేనుతూనే, ఉచిత పథకాల ఊరేగింపులు చేస్తుంటదన్నాడు కవి. కలల్ని ధ్వంసం చేయడం, ఒక తరం తరాన్నే మట్టిలో కప్పేయడం, దేనికి దుమ్ము అంటకుండా చేయగల నేర్పరితనం ఈ పాలకులకు మన్నుతో పెట్టిన విద్య అని మట్టిలో కలిసిపోతున్న జీవితాల గురించి కవి రవీందర్ ఆవేదన వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.

బహుశా స్మశానం ఏదో ఒకరోజు పాలకుడి కోసం కూడా తప్పకుండా ఎదురుచూస్తుంది అంటూ స్మశానావరణం సాక్షిగా! కవితలో కవి సమాధానం ఇచ్చిన తీరు అద్భుతంగా ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి స్మశానానికి చేరాల్సిందే. కానీ ఈ దోపిడీ వ్యవస్థలో పాలకుల దమన నీతిని, రాజ్యం పట్ల చూపిస్తున్న నిర్దయను చూసి ఆవేదన చెందారు. చక్కటి కవితను అందించి పాలకులు కళ్ళు తెరుచుకునేటట్లు చేసినారు. కవి పసునూరి రవీందర్ మరిన్ని మంచి కవితా సుమాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.

డా. పసునూరి రవీందర్ స్మశానావరణం సాక్షిగా! కవితపై విశ్లేషణ

నరేంద్ర సందినేని

70930 30259.


Next Story

Most Viewed