జయహో అందెశ్రీ

by Ravi |
జయహో అందెశ్రీ
X

జయ జయహే తెలంగాణ

అంటూ జై కొట్టింది ఈ గేయం

కోట్లాది గొంతుకలను

ఏకం జేసింది ఈ గేయం

తెలంగాణ చరితను

ఎలుగెత్తి చాటింది ఈ గేయం

అమరుల ఆశయ సాధనకు

అడుగేసింది ఈ గేయం

తెలంగాణ ఉద్యమానికి

ఊపిరి పోసింది ఈ గేయం

కాకతీయుల కళావైభవాన్ని

కళ్ళకు చూపింది ఈ గేయం

చార్మినారు గొప్పదనాన్ని

చాటి చెప్పింది ఈ గేయం

సింగరేణి బంగారం వెలుగులు

విరజిమ్మింది ఈ గేయం

సుభిక్షమైన తెలంగాణను

కాంక్షించింది ఈ గేయం

స్వరాష్ట్ర సాధనలో జాతిని

జాగృత పరచింది ఈ గేయం

తెలంగాణ తల్లికి నీరాజనం

పలికింది ఈ గేయం

పోరునడ్డు పెట్టుకొని పాలకులైనోళ్లను

ప్రశ్నించింది ఈ గేయం

అన్యాయం చేసినోళ్ల గుండెల్లో

సింహ స్వప్నమై నిలిచింది ఈ గేయం

కాదన్న వాడే ప్రపంచ తెలుగు

మహాసభల్లో పాడేలా చేసింది ఈ గేయం

అక్షరమాలై అందెశ్రీ కలం నుంచి

జాలు వారింది ఈ గేయం

పదేళ్ళు గడిచాక....

పరిఢవిల్లబోతోంది ఈ గేయం

పోరాడి సాధించుకున్న తెలంగాణ

రాష్ట్ర గీతంగా నిలుస్తోంది ఈ గేయం

- భీష్మాచారి రామగిరి

Next Story