ఒక అంధుని ఆవేదన

by Ravi |
ఒక అంధుని ఆవేదన
X

ఓ భగవంతుడా...

ఓ అద్భుతమైన విశ్వాన్ని సృష్టించావు..

ఆ విశ్వంలో అందమైన

సూర్య మండలాన్ని నిలబెట్టావు

అందులో సుందరమైన భూగోళాన్ని ఉంచావు..

ఆ భూగోళంపై

అందమైన అడవుల్ని

జాలువారే జలపాతాలను

వయలొలికే నదీ జలాలను

కనువిందు చేసే కమనీయ

దృశ్యాలను సాక్షాత్కరించావు..

అనంతకోటి ప్రాణ కోటికి

ప్రాణం పోశావు..

ప్రాణ వాయువునిచ్చి

ప్రాణులన్నిటికీ మనుగడ నిచ్చావు.

మనిషి అనే విజ్ఞానపు ఖనిని పుట్టించావు..

ఆ మనిషి మరెన్నో వింతలు సృష్టించాడు..

ఆ మనుషుల్లో ఒక్కడిగా సృష్టించిన

నాకు కళ్ళు ఎందుకు ఇవ్వలేదు..

రాత్రి పగలు సృష్టించావు

రాతి గుండెను ధరించావు..

కళ్ళు లేని కబోదికి కన్పించని నీ సృష్టి

కళ్ళున్న కబోదికి కన్పిస్తే ఎంత?

లేకుంటే ఎంత?

కనికరం లేని నీ ప్రపంచం

నా మనోనేత్రంతో వీక్షిస్తా..

కఠినమైన నీ పరీక్షలు

నా మనో ధైర్యంతో జయిస్తా..

మానసిక వైకల్యం ఉన్న

అల్పుడి సౌందర్యం

నా ఆత్మ సౌందర్యం ముందు ఎంత ?

శిరందాస్ శ్రీనివాస్

94416 73339

Next Story

Most Viewed