దారాదత్తం

by Ravi |
దారాదత్తం
X


పేదోడు అయింతన్న

గంజి మెతుకులు తాగకుంట

సర్వీస్ చార్జీల పేరిట

నల్లులై రక్తాన్ని పీలుస్తూ

బలిసినోడికీ స్పెషల్ బోన్స్

సూపులు పోసి తాగిపియ్యుర్రి

పంట పెట్టుబడి కోసం చేసిన అప్పు

తీర్స మాంసం ముద్దలు

కీస్తీ కింద జమజేస్తుంటే

అసలు కోసం

మా అస్థిపంజరన్ని అమ్మకానికి పెట్టి

ఐనొడికీ వడ్డి, అసలు మాపి జేయ్య

రాయితీలు ఇయ్యుర్రి

చెమటోడ్చి పండించిన గింజలు

పంది కోక్కుల పలుగాకుంట కావాలివంటే

మద్దతు ధర ఇయ్యక

మీ ఆప్తులు అగ్గసగ్గ అందుకునేలా

దళారీల ధనం పెట్టెలు నిండేలా

కంపెనీలు కొలాంచి పియ్యుర్రి

నవజావన్లకు

నౌకరిలు లేక నడి రోడ్డు మీద పడ్డా సరే

ఉపాధి లేక వలస కార్మికుడై

ఊరుకు మొఖం చూపియ్యకున్న సరే

ఖాళీ సందులు నింపకా

ఉన్న సందులను ఊడగోట్ట ప్రైవేటీకరించుర్రి

ప్రజల ఆస్తిని

పదితరలు ఆనుభవించల్సిన ఆస్తులని

పర్సంటేజ్ ఇచ్చినోడికి

పక్కా వరిసినట్టు పరిసి దారాదత్తం చేయ్యుర్రి,

జి.యం. నాగేష్ యాదవ్

9494893625

Next Story

Most Viewed