- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
తెలుగు వెలుగులు లేవుతల్లి

తెలుగు తల్లి తెలుగు తల్లి,
తెలుగువెలుగులు లేవుతల్లి,
మైలబట్టేనె తెలుగుబాష
మసక భారనె తెలుగు మాట
తెలుగుతల్లని మాటకూడా
తెలుగులోన రాయలేమే !
తెలుగు మల్లెకు తెగులు నేడు
తెలుగు చదువుకు విలువలేదు
పసిడి పంటల పల్లెనొదిలి
గంపెడాశతొ పట్న మొచ్చి,
కోటి ఆశతొ కొలువునడిగితే.
ఆంగ్ల మాద్యం అడుగుతారే !
తెలుగు చదివితె తెలివిలేదా
తెలుగులోన బలములేదా !
తెల్లవానికి తెలుగురాదే !
తెలుగురాని తెల్లవాడు
తెలుగుదేశం ఏలలేదా !
తెలుగు తల్లికి పుట్టిమనము
అమ్మా అని పిలవకుండా
వట్టిపోయిన శవం పేరుతో
మమ్మి అనే పిలుద్దామా !
తెలుగు వారు కలిసినప్పుడు
తెలుగులొ మాట్లాడకుండా
ఆంగ్లములో అరుచుకొనుట
ఎంతవరకు ధర్మము !
తెలుగు తల్లికి అవమానము
పొరుగు భాషలు నేర్చుకో,
తప్పుకాదది గొప్ప మెప్పు,
అమ్మ భాషను మరువకు
తప్పుకాదది పెద్ద ముప్పు
తెలుగు విలువను కానరా
ఓ... తెలుగువాడ.
తెలుగు ఖ్యాతిని చాటరా
నా... తెలుగువాడ.
లింగస్వామి గౌడ్
98488 11828
- Tags
- POEM