త్యాగమే మన గానమా..!

by Disha edit |
త్యాగమే మన గానమా..!
X

మొన్న సాయుధం

నిన్న గాంధేయుధం

ఇంకనూ తప్పదేమో

తెలంగాణకు పోరు పథం

విసిగి విసిగి వేసారాలేమో

కాలం చేసే కవ్వింపులతో..

వీర తెలంగాణమా..

పోరు తెలంగాణమా..

త్యాగమే మన గానమా..

ఒక కాళోజీ రావాలేమో..

ఒక దాశరథి లేవాలేమో..

ఒక రావి రెడ్డి.. ఒక బీంరెడ్డిలు..

ఒక ఐలమ్మ.. ఒక కమలమ్మలు..

ఉద్యమ జ్యోతులవ్వాలేమో

ఒక ఆరుట్ల.. ఒక పాల్వంచ లు..

కెరటాలై ఉరకలెత్తాలేమో..

అణగారిన వర్గాలొక్కటయ్యి

నిజాంలకు నీళ్ళోయాలేమో

పోరాడితే పోయేదేముందీ...

పోతే గీతే తెలంగాణను కమ్మిన

మబ్బు తెరలు తొలగుడు తప్ప

-- పాల్వంచ హరికిషన్

95024 51780


Next Story

Most Viewed