విద్రోహ చరిత్ర సాక్షాలు

by Ravi |
విద్రోహ చరిత్ర సాక్షాలు
X

విద్రోహ దినం

బలవంతపు సమీకరణ

సంకర సమాజావిష్కరణ

కత్తుల కోలాటంలో

నెత్తుటి జాడల జ్ఞాపకాల

సెప్టెంబర్ 17 స్వతంత్రం కాదు

విలీనం లాంటి విద్రోహం

ఎంత విషాదం

ఎన్ని అవమానాలు

ఎంత ఘోరం

నా తల్లి తెలంగాణ నిలువెల్లా

కోటిగాయాల గేయమేనా?

నన్ను చంపినా

ఈ పోరాటం ఆగదు !

నెహ్రూ సైన్యాలను

రజాకార్లనే తరిమిన

వీర బైరాన్ పల్లి

పరకాల కూటిగల్లు

పెరుమాళ్ళ సంకీస

చరిత్రకు సాక్ష్యాలుగా

ఒకడు విముక్తి

ఇంకొకడు విమోచన

మరొకడు స్వాతంత్ర్యం

అంటున్నారు !!

ఇదేనా విముక్తి, విమోచన

స్వాతంత్ర్యం అనుకుంటే

గరం నరం బేషరం

లేకుండానే బతికేయండి

(సెప్టెంబర్ 17 విద్రోహ దినం)

- బి. ప్రవీణ్,

సీకేఎం కళాశాల

81424 60664

Next Story