రైతు గోస

by Disha edit |
రైతు గోస
X

ఆరుగాలం కష్టాలె సాగుచేసే రైతన్నకు..

భూమి తోటి పోరు జేసి భూమి లోనె కూలవట్టె

బుగ్గిపాలు కాబట్టె...

ఆకలి తీర్చే అన్నధాతకు

"అత్మ" హత్యలే శరణమాయే

పంటకొరకు నీరు లేక...! బోరుబావులు ఎన్ని తొవ్విన

బోరులోన నీళ్ళు రాక...రైతు

కళ్ళల్లో నీళ్ళొచ్చే.. కష్టాలు తన్నుకొచ్చే

ఇత్తుల కల్తీ..ఎరువుల కల్తీ

విపత్తు విలయం మరణ మృదంగం

పంట కొరకు ఋణము దెచ్చి... రైతన్న ఎగుసం జేస్తే...

చేతికొచ్చిన పంట జూడు....

వడగండ్లు చిదిమేసే... రైతు

ఆశలన్నీ ఆవిరాయే..

గిట్టుబాటు ధర లేక..‌.

పెట్టు బడికి సరిపోక....

అప్పులేమో మిగిలి పోయే

తిండి వెట్టి రైతన్న.. కూడు లేక కుములవెట్టే

అన్న దాతకు పెద్ద పీఠని..

గొప్పలెన్నొ జెప్పుతున్నరు

ఋణ భారం మెండు గాయే

గుండె కోత తీరదాయే.... రైతు

గోస మారదాయే

ఏలెటొళ్ళు మేలుకొని.. అన్నదాతల ఆదుకోండి

జి.చంద్రమోహన్ గౌడ్

98665 10399


Next Story

Most Viewed