వారం వారం మంచి పద్యం: ధర్మము

by Disha edit |
వారం వారం మంచి పద్యం: ధర్మము
X

మిత్రులతో కలిసి కబుర్లలో పడిపోయాడు బుంగి. సరదా కబుర్లు, బోలా కబుర్లు, కోప కబుర్లు, శాంతి కబుర్లు, అసూయ కబుర్లు, యుద్ధ కబుర్లు, సంధి కబుర్లు, సినిమా కబుర్లు, కుటుంబ కబుర్లు, చిన్ననాటి కబుర్లు, సీరియల్ కబుర్లు, మంచి కబుర్లు, మనసు కబుర్లు, ప్రేమ కబుర్లు, చావు కబుర్లు, పురాణ-ఇతిహాస కబుర్లు, తిండి కబుర్లు,ఆరోగ్య కబుర్లు, ఆసుపత్రి కబుర్లు, కాలక్షేప కబుర్లు, కుబేర కబుర్లు, దరిద్ర కబుర్లు, సమాజ కబుర్లు, రాజకీయ కబుర్లు, నేలబారు కబుర్లు, అంతరిక్ష కబుర్లు, చుక్కల కబుర్లు, చెక్కుల కబుర్లు, సెల్ కబుర్లు, నెట్ కబుర్లు, వలస కబుర్లు, పంట కబుర్లు, పైకం కబుర్లు, మనిషి కబుర్లు, మమతల కబుర్లు ఇలా అన్ని రకాల కబుర్లతో కాలం గడుస్తుంది.

‘తన్ను మాలిన ధర్మం లేదు. అది పాటించని వానికి అధోగతే’ అన్నారొకరు. నిజమే. నేను సమర్థిస్తున్నాను. అన్నాడు బుంగి. ఒక ఉదాహరణతో సమర్థించు అన్నారొకరు.

మహాభారతంలోని కర్ణుడు ఇందుకు ఉదాహరణ. కర్ణుడు వీరుడు అందులో సందేహం లేదు. తన్ను మాలిన ధర్మాన్ని ఆచరించి కనుమరుగయ్యాడు. రాజకుమారుల విద్యాభ్యాసం పూర్తయ్యాక కుమారాస్త్ర ప్రదర్శన జరిగింది. అందులోకి ఇతరులకు ప్రవేశం లేదు. కర్ణుడు చొచ్చుకొచ్చాడు. ఫలితంగా అంగ రాజయ్యాడు. జీవితాంతం స్నేహభారం మోయాల్సి వచ్చింది. వచ్చింది ఇంద్రుడని తెలిసినా కవచకుండలాలను ఒలిచి ఇచ్చాడు. యుద్దరంగంలో శక్తి ఉడిగి, శరీరం పచ్చి పుండై పడిపోయాడు. కుంతికిచ్చిన వరం మేరకు యుద్ధంలో నలుగురు పాండవులను వదిలాడు. అవమాన భారం మింగలేని ధర్మజుడు, కర్ణుడిపైకి అర్జునుడిని ఉసిగొల్పాడు. అలా తన మరణానికి తనే బాటలు వేసుకున్నాడు. తన వృద్ధిని కాంక్షించక, అర్జునుడి మరణాన్ని కాంక్షించి అవనిలో కలిసిపోయాడు. కర్ణుడు తన చావుకు తానే కారణమయ్యాడు. అది విన్న అందరూ భలే భలే అంటూ ఇండ్లకు వెళ్ళారు.

నేల విడిచిన సాములు నిలువనెపుడు

పాలు పటువయు మిగులును పాటు పడిన

తన్నుమాలిన ధర్మము తుదకు చేటు

కశప చెప్పిన కధనమ్ము కాంతి పధము

డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732


Next Story

Most Viewed