కవిత: శతకోటి కాంతుల తెలంగాణ

by Disha edit |
కవిత: శతకోటి కాంతుల తెలంగాణ
X

కొత్త రాష్ట్రంలో కోటి ఆశలు గాయపడ్డ గతం గాడిన పడాలే

మూగబోయిన గీతం మోత మోగాలి!!

ఆరిపోతున్న దీపం కొత్త కాంతులతో ప్రజ్వరిల్లాలే

కూలిపోతున్న గుడిసె

మూలవాసం నిలబడాలే

మూలబడ్డ నాగలి తొలకరితో పులకరించాలే!!

బీడు వారిన భూమి నదుల నీళ్లతో తడిసిపోవాలే

పాడుబడ్డ చెరువు ప్రాణం పోసుకోవాలే!!

అడవి బిడ్డల ఆత్మగౌరం నిలబడాలే

పాలమూరు వలసలు ఆగిపోవాలే

కరీంనగర్ కన్నీళ్లు ఆగిపోవాలే

ఓరుగల్లు ఖ్యాతి ఎలుగెత్తి చాటాలే

నడుము వంగిన నల్లగొండ లేచి నిడబడాలే!!

మెతుకు సీమ చిత్రం బతుకు మారిపోవాలే

నిజామాబాదు కన్న కలలు నిజం కావాలే

ఖమ్మం కోయ బిడ్డల ఆశలు తీరిపోవాలే

సంగారెడ్డి రవాణా తిరిగి పోవాలే

హైదరాబాద్ ఆత్మగౌరవం ఎలుగెత్తి చాటలే!!

పునర్నిర్మాణంలో శతకోటి కాంతులతో తెలంగాణ ప్రజ్వలిల్లాలే

నా తెలంగాణ!!!

దేవులపల్లి రమేశ్.

9963701294



Next Story