16 గేట్ల ఎత్తివేతతో తాలిపేరుకు నీటి పరవళ్లు.. ఈ వరద ఆగేనా..

by Sridhar Babu |   ( Updated:2021-07-14 00:51:07.0  )
16 గేట్ల ఎత్తివేతతో తాలిపేరుకు నీటి పరవళ్లు.. ఈ వరద ఆగేనా..
X

దిశ, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు వరద నీటితో పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తమైనారు. ప్రస్తుతం తాలిపేరు డ్యామ్ వద్ద 16 గేట్లు ఒక అడుగు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీరు దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 8,720 క్యూసెక్కుల నీరు (ఇన్‌ఫ్లో) వస్తున్నట్లుగా తాలిపేరు డీఈఈ తిరుపతి తెలిపారు. ప్రాజెక్టు క్రస్ట్ లెవల్ 69 మీటర్లు. 74 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్‌లో ప్రస్తుత వరద ఉధృతిని బట్టి 73.49 మీటర్ల నీటిని నిల్వచేస్తూ, అదనపు నీటిని గేట్లుఎత్తి దిగువకి విడుదల చేస్తున్నారు. డ్యామ్‌లో గంటగంటకు వరద పెరుగుతోంది.



Next Story

Most Viewed