ఒక్క కౌగిలింతలో ఎన్నో కబుర్లు..

by Disha Web Desk 17 |
ఒక్క కౌగిలింతలో ఎన్నో కబుర్లు..
X

దిశ, ఫీచర్స్: ఈ కాలంలో ఓ వైపు పని భారం.. మరోవైపు కుటుంబ బాధ్యత.. ఎన్నో సమస్యలు.. ఇలా చాలా మంది ఒత్తిడితో సతమతమవుతున్నారు. అలాంటి వారికి.. జస్ట్ ఒక కౌగిలింత (హగ్) ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి, మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. కౌగిలింత అంటే కేవలం ప్రేమికులు, భార్య భర్తల మధ్య ఉండేది మాత్రమే కాదు.. తరచుగా మనమందరం ఆనందం, దుఃఖంలో మన స్నేహితులను, సన్నిహితులను కౌగిలించుకుని ఇచ్చుకునే భరోసా, మానసిక మద్దతు. అదే సమయంలో ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలోనే ఒక్క కౌగిలింత అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు.. అవేంటో తెలుసుకుందాం.

* ఒత్తిడి దూరం..

హగ్ చేసుకోవడమనేది ఒక మంచి ఫీలింగ్‌ని ఇస్తుంది. మనం ఎలాంటి బాధలో ఉన్నా హగ్ చేసుకుంటే మనసుకు ఓదార్పునిస్తుంది. అంతేకాదు ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. అందుకే మీ పార్ట్‌నర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు మీ కౌగిలింతతో ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రయత్నించండి అంటున్నారు నిపుణులు.


* శరీర బరువు, మెదడు భారం తగ్గుతుంది..

బరువు పెరగడానికి ముఖ్య కారణాల్లో ఒత్తిడి కూడా ఒక్కటి. టెన్షన్, వర్క్ స్ట్రేస్ రోజూ ఉంటుంది. దీంతో కొంత మంది ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఆత్మీయుల కౌగిలింత ఒత్తిడిని దూరం చేస్తుంది. రిలాక్స్ అయి బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది. 10 సెకన్ల కౌగిలింత అనేక సమస్యలకు ఉపశమనంగా పనిచేస్తుంది.

* రక్తపోటు నుంచి దూరం..

అదే విధంగా 20 సెకన్ల పాటు హగ్ చేసుకోవడం ద్వారా ఒత్తిడి వల్ల కలిగే ప్రభావం తగ్గి రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి బీపి కంట్రోల్‌లో ఉండాలనుకుంటే ఆత్మీయులను, ఒక్కసారైనా కౌగిలించుకోమని చెబుతున్నారు నిపుణులు.



* పుట్టిన పసి పిల్లలు కౌగిలించుకుంటే..

అప్పుడే పుట్టిన బిడ్డను, తల్లి దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. దీంతో ఆ తల్లి పడిన నొప్పి మొత్తం బిడ్డ కౌగిలింత దూరం చేస్తుంది. అలాగే తల్లి కౌగిలింత వల్ల పిల్లలకు సురక్షితమనే భరోసానిస్తుంది. ఏడుపు తగ్గి, హాయిగా నిద్రపోయేందుకు, ఆరోగ్యంగా పెరిగేందుకు కారణం అవుతుంది.



* బాడీలోని నొప్పులు దూరం..

కౌగిలించుకోవడం వల్ల నొప్పులు కూడా దూరమవుతాయి. కొన్ని రకాల స్పర్శలకు ఆ గుణం ఉందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి, కౌగిలించుకోవడం వల్ల కలిగే నష్టాలేవి లేవు.. అంతే కాకుండా, ఒక్క కౌగిలింతతో ఎదుటివారికి ఎన్నో భావాలు చెప్పవచ్చు.


* రోజుకు ఎన్నిసార్లు.. హగ్ చేసుకోవాలి..

మన మనసుకు దగ్గరైన వారు దగ్గరగా ఉన్నప్పుడు, ఎన్ని సార్లు కౌగిలించుకున్నా తప్పు లేదు. రోజుకు నాలుగుసార్లు, వీలైతే అంత కంటే ఎక్కువ సార్లు కౌగిలించుకోండి. ఈ విధంగా మీ ప్రేమను పంచుకోండి. బంధాన్ని బలంగా చేసుకోండి. విదేశాల్లో తెలిసినవారు కలిసినప్పుడు వారు కౌగిలింతలతో పలకరించుకుంటారు. కానీ మన సంప్రదాయాలు కట్టుబాట్లు కౌగిలింతను తప్పుగా చూస్తున్నాయి. కానీ వారికి ఈ లాభాల గురించి తెలియదు కనుక తప్పుగా భావిస్తారు. మనకు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది.



Next Story