ఆమెతోనే సాధ్యం!! బంధీ నుంచి చేంజ్ మేకర్స్‌గా ఇండియన్ ఉమెన్స్

by Disha Web Desk |
ఆమెతోనే సాధ్యం!! బంధీ నుంచి చేంజ్ మేకర్స్‌గా ఇండియన్ ఉమెన్స్
X

దిశ, ఫీచర్స్: 'మహిళా స్వాతంత్ర్యమే సామాజిక స్వాతంత్ర్యానికి సంకేతం'.. కానీ ఆ స్వేచ్ఛ ఇప్పటికీ పూర్తిగా లభించట్లేదు. పక్షుల్లాగా పంజరాల్లో బంధించబడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ బంధీ నుంచి బయటపడేందుకు తమ రక్షణ వలయాన్ని తామే నేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిర్మొహమాటంగా అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ.. నైపుణ్యాలను పెంచుకుంటూ.. తమ కలలు నెరవేర్చుకుంటున్నారు. ఇండిపెండెంట్‌గా జీవిస్తున్నారు. గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆటోమేటిక్‌గా దేశంలో మార్పు తీసుకోస్తున్నారు. అందుకే అన్ని అంశాలలో మహిళా సాధికారత కోసం భారత ప్రభుత్వం పట్టుదలతో కృషి చేయడానికి ఇదొక ముఖ్య కారణం.

నిజానికి ప్రభుత్వ ప్రగతిశీల పథకాలు, విధానాలు.. ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలోని మహిళలను ప్రోత్సహించడానికి, వారి సొంత సామాజిక-ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేయడానికి వారధిగా ఉన్నాయి. తద్వారా శరవేగంగా గ్రామాలు అభివృద్ధి చెందేందుకు స్త్రీల కీలక పాత్ర అవసరమవుతోంది. మొత్తానికి అక్కడ నెలకొన్న సమస్యలకు సమర్థవంతమైన మరియు స్థిరమైన పరిష్కారాలను కనుగొంటున్న మహిళలు.. తమ ఊరిని 'మోడల్ విలేజ్‌'గా మార్చేందుకు స్టార్టప్ ఆవిష్కరణలను గుర్తించి, అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే కొనసాగితే ప్రధాని మోడీ అనుకున్నట్లుగానే.. దేశం 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది.

బాటమ్-అప్ విధానాన్ని అవలంబిస్తూ.. 'మోడల్ విలేజ్' ఆవిష్కర్తలు ఇప్పటికే ఉన్న స్టార్టప్‌లు మరియు పర్యావరణ వ్యవస్థలోని ఇతర సంబంధిత వాటాదారులకు సహకరిస్తున్నారు. వ్యవసాయం భారతీయ గ్రామాలకు జీవనాధారం, ఇక్కడ ఏదైనా ఆవిష్కరణ గణనీయమైన అభివృద్ధిని అందించగలదు. కాబట్టి దేశంలో వ్యవసాయం యొక్క పారిశ్రామికీకరణను ప్రోత్సహించడానికి మహిళలు ఎటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టట్లేదు. తమ గ్రామంలోని వ్యవసాయాన్ని.. 'వ్యవసాయ-వ్యాపారం'గా మార్చడానికి, సమాజ ఆలోచనలను మార్చడానికి కృషి చేస్తున్నారు. వివిధ వ్యవసాయేతర రంగ ఆవిష్కరణలలో ప్రభుత్వంచే ప్రోత్సహించబడుతున్నారు.


ప్రజెంట్ ఉమెన్ చేంజ్‌మేకర్స్‌గా ఉండాలనుకుంటున్నారు. సామాజిక సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి వినూత్న విధానాన్ని ఎంచుకుంటున్నారు. సొసైటీలో మార్పు కోరుకుంటున్న వారు సెల్ఫ్-డెవలప్మెంట్‌పై దృష్టి పెడుతూ... సమాజానికి వారి జ్ఞానాన్ని వర్తింపజేయాలని అనుకుంటున్నారు. ఈ విధంగా మహిళలు తమ ఆవశ్యక పాత్రను మరింత బలోపేతం చేస్తున్నారు.

* గ్రామాల అభివృద్ధి ఎజెండాలో ముఖ్యపాత్ర.

* సంపాదించిన జ్ఞానం, ఆలోచనలు, అభ్యాసం, సూచనల ద్వారా తమ గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మార్చడానికి సహకారం.

* గ్రామస్తులు వారి సమస్యలపై మార్గదర్శకత్వం కోరుకుంటారు. కాబట్టి చేంజ్ మేకర్స్ సొసైటీ లీడర్స్‌గా అభివృద్ధి చెందుతున్నారు.

* ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రగతిశీల వ్యక్తిగా గౌరవం పొందుతున్నారు.


చేంజ్ మేకర్స్.. వ్యక్తిత్వ లక్షణాలు

* ప్రతిష్టాత్మక మరియు రిస్క్ తీసుకునే వ్యక్తి

* క్రియేటివ్‌గా ఉంటూ నేర్చుకోవాలనే గొప్ప కోరిక కలిగి ఉండాలి

* చక్కని భావవ్యక్తీకరణ నైపుణ్యాలు

* సాంఘిక సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రేరేపించాలి

* శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండి.. ఇతరులకు సహాయం చేయడానికి మొగ్గు చూపాలి

READ MORE

ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏదీ..?



Next Story

Most Viewed