డ్రగ్ టెస్ట్ ఎవరికి చేస్తారు.. బ్లడ్, నమూనాలే కీలకమా?లేక?

by Samataha |
డ్రగ్ టెస్ట్ ఎవరికి చేస్తారు.. బ్లడ్, నమూనాలే కీలకమా?లేక?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం టాలీవుడ్‌లో రేవ్ పార్టీ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎవరి నోట విన్నా ఇదే పదం వినిపిస్తుంది. నటీనటుల డ్రగ్ టెస్ట్ కోసం నమూనాలు సేకరించారు. త్వరలోనే వాటి ఫలితాలు వస్తాయి అని బ్రేకింగ్స్ వస్తుంటాయి. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు డ్రగ్ టెస్ట్ ఎవరికి చేస్తారు. ఎందుకు చేస్తారు. బ్లడ్‌తో చేస్తారా లేక వేరే నమూనాలేమైనా కీలకంగా ఉన్నాయా? ఈ విషయాల గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు డ్రగ్ టెస్ట్ ఎవరికి చేస్తారు అనే విషయంలోకి వెళితే.. చాలా మంది డ్రగ్ తీసుకుంటారు. అయితే కొంత మంది మోతాదుకు మించి తీసుకోవడం జరుగుతుంది. చట్టవిరుద్ధమైన డ్రగ్ కొకైన్ వంటి వాటిని సీక్రెట్‌గా వాడుతుంటారు. అయితే వీటిని అధిక మొతాదులో తీసుకున్నారు అనే సమాచారం అందితే వారికి ఈ టెస్ట్ చేస్తారు. అలాగే రేవ్ పార్టీలు, రైడ్స్, ప్రమాద విచారణ, డ్రగ్స్ వాడుతూ పట్టు బడిన వారికి ఈ టెస్ట్ చేస్తారు. అయితే కొంత మంది ఆ విషయంలో చాలా యాక్టివ్‌గా ఉండటానికి కూడా డ్రగ్ తీసుకుంటారంట. అయితే అలాంటి వారికి కూడా ఈ టెస్ట్ చేస్తారు.

బ్లడ్ నమూనాలే కీలకమా?

ఇక చాలా మంది డ్రగ్ టెస్ట్ అంటే బ్లడ్ సేకరించి చేస్తారని అనుకుంటారు. కానీ డ్రగ్ తీసుకున్న వారికి యూరిన్ టెస్ట్ ద్వారా కచ్చితమైన రిజల్ట్ వస్తుందంట. మాములుగా అయితే డ్రగ్ టెస్ట్ చేయాలి అనుకున్న వారి నుంచి, మూత్రం, ఉమ్మి, వెంట్రుకలు, చెమట వంటి నమూనాలు స్వీకరించి టెస్ట్ చేస్తారు. ఇంకొంత మంది బ్లడ్ తీసుకొని కూడా టెస్ట్ చేస్తారు. అయితే బ్లడ్ టెస్ట్ కంటే.. డ్రగ్స్ ట్రేసస్ కోసం,యూరిన్ టెస్ట్‌నే బెస్ట్‌గా చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ? ఇది నాన్వాసివ్, ఎన్ని రోజులు, ఎన్ని ఔషదాలను తీసుకున్నారో గుర్తించగలదు. అంటే డ్రగ్స్ ఎన్నో గంటలు, రోజుల ముందు తీసుకున్నా.. దానిలో డ్రగ్స్ సంకేతాలు కనుగొనవచ్చునంట. రక్త పరీక్ష కాస్త హానికరం అంట, ఇది ఉపయోగించిన కొన్ని గంటల వరకే కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే బ్లడ్ టెస్ట్ కాస్త రేర్‌గా చేస్తారు అని చెప్పుకొస్తున్నారు నిపుణులు.

Next Story