Blood Groups : ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎలాంటి రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది?

by Javid Pasha |
Blood Groups : ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎలాంటి రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది?
X

దిశ, ఫీచర్స్ : ప్రతి వ్యక్తికీ తన బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలిసి ఉండటం ఈరోజుల్లో తప్పనిసరి. దీనివల్ల ఏదైనా ప్రమాదంలో గాయపడినప్పుడు, అత్యవసరం ఏర్పడినప్పుడు, రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు ప్రాణాపాయం నుంచి యబటపడే చాన్సెస్ అధికంగా ఉంటాయి. డాక్టర్లు వెంటేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. ఇదంతా తెలిసిన విషయమే. అయితే వ్యక్తుల్లోని బ్లడ్ గ్రూప్స్ వారి ఆరోగ్య సమాచారాన్ని అందించడంలోనూ కీ రోల్ పోషిస్తాయి. ఎందుకంటే ఇవి జన్యుపరమైనవి. ఎప్పటికీ మారవు. ప్రస్తుతం A, B, AB, అనే రకాల గ్రూప్స్ ఉన్నాయి. రక్త నమూనాను బట్టి ఏయే గ్రూపు వ్యక్తులకు ఎలాంటి రోగాలు వస్తాయో కూడా అంచనా వేయవచ్చునని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.

గుండె జబ్బులు

గుండె జబ్బులు సాధారణంగా AB, B బ్లడ్ గ్రూప్స్ ఉన్న వ్యక్తులకు వచ్చే రిస్క్ ఎక్కువ. కారణం ఏంటంటే.. వీరి రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉంటాయి. అలాగే రక్తం గడ్డ కట్టడానికి కారణం అయ్యే ప్రోటీన్లు కూడా ఎక్కువే. కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు వాయు కాలుష్యానికి దూరంగా ఉండటం బెటర్. తరచూ ఫిజికల్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఇండోర్ వర్కవుట్స్ ఎంచుకోవడం మంచిది. హార్ట్ పవర్ పెంచే ఆహారాలను తింటూ ఉండాలి. ధూమపానం, మద్య పానానికి దూరంగా ఉండాలి. ఇక O పాజిటివ్ బ్లడ్‌ గ్రూప్ ఉన్న వ్యక్తులకైతే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ.

కడుపు నొప్పి, అల్సర్లు

ఓ(O) పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువే. కానీ ఆహారాలు పడకపోతే కడుపునొప్పి, అలాగే స్టమక్ అల్సర్లు వచ్చే ఆస్కారం ఎక్కువ. అంతేకాకుండా ఇతర గ్రూపుల వారితో పోల్చినప్పుడు వీరికి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే చాన్స్ కూడా అధికం. ఓ పాజిటివ్ గ్రూప్‌తో పాటు, ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల్లోనూ కొన్నిరకాల స్టమక్ క్యాన్సర్లు వచ్చే చాన్సెస్ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, చేపలు, గుడ్లు వంటివి ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ధూమపానం మానుకోవాలి. వ్యాయామం లేదా ఫిజికల్ యాక్టివిటీస్ తప్పనిసరి.

మానసిక ఒత్తిడి

మానసిక ఒత్తిడి మిగతా వారితో పోల్చినప్పుడు ఎ (A) పాజిటివ్ బ్లడ్‌ గ్రూప్‌ వారిపై అధిక ప్రభావం చూపుతుంది. జన్యుపరంగా వీరిలో స్ట్రెస్‌ హార్మోన్ అయినటువంటి కార్టిసాల్‌ ప్రొడ్యూస్ అయ్యే చాన్సెస్ అధికంగా ఉంటాయి. కాబట్టి తరచుగా వ్యాయామం, సోషల్ యాక్టివిటీస్, ప్రకృతిలో గడపడం వంటివి మేలు చేస్తాయి. డైలీ 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం వీరికి చాలా అవసరం.

బ్లడ్ క్లాట్ అవడం

ఎ, బి (A, B) బ్లడ్ గ్రూపులకు చెందిన వారి రక్తం మిగతా వారితో పోల్చితే క్లాట్ అయ్యే అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే పక్షవాతం రావచ్చు. దీంతోపాటు వీరిలో వయస్సు పెరిగే కొద్దీ దృష్టిలోపం వంటివి పెరిగే అవకాశం ఉంటుంది. రక్తంలో ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

*నోట్ : పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ఆధారాలు, నిర్ధారణల విషయంలో ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed