విడాకులు తీసుకున్న మహిళలకు ఎలాంటి హక్కులు ఉంటాయంటే?

by Jakkula Samataha |
విడాకులు తీసుకున్న మహిళలకు ఎలాంటి హక్కులు ఉంటాయంటే?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం విడాకుల అనేవి చాలా ట్రెండ్ అయిపోతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ డివోర్స్ తీసుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెళ్లైన రెండు మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకుంటున్నారు. అయితే కొందరు విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే మరికొందరు మాత్రం తమ పిల్లల బాధ్యతలు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.

అయితే డివోర్స్ అనేది మహిళపై ఎక్కువ ప్రభావం చూపుతుందా అంటే అవును అనే మాటే వినిపిస్తుంది. డివోర్స్ తర్వాత మహిళలు ఒంటరిగా ఉండటం కష్టమే అని చెప్పాలి. కానీ బంధం బాధ్యతగా లేని సమయంలో వారు విడాకుల వైపు మళ్లీ సింగిల్‌గా ఉండటానికి ఇష్టం చూపుతున్నారు. కాగా, విడాకుల తర్వాత మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం లేని భార్యకు కనీస అవసరాలు తిండి, వైద్య, విద్య వంటి ఖర్చుల కోసం జీవిత భాగస్వామి తనకు మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలని హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లోని సెక్షన్ 3మ చెప్తోంది. వివాహం కాని కూతురు ఉంటే ఆమె వివాహం అయ్యేదాకా అవసరమైన ఖర్చు తన తండ్రే భరించాలి, ఒక వేళ మహిళ భర్త మరణిస్తే ఆమె మామగారు మెయింటెనెన్స్ ఇవ్వాలని చట్టంలోని సెక్షన్ 19 చెప్తోంది. అలాగే పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నాన్ని కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.

అయితే కొంత మంది బయట సెటిల్ చేసుకుంటారు. అటువంటి వారు విడాకుల సమయంలో భరణం ఆశించక పోయినా, తర్వాత ఎప్పుడైనా మాజీ భర్త నుంచి భరణం పొందే అవకాశం ఉంటుంది. వారి ఆస్తులపై కూడా పిల్లలకు చెందుతాయి. కేసు వేసుకొని ఆస్తుల్లో కొంత వాటా పిల్లల పేరు మీద ఫిక్స్ చేయించుకునే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed