మార్నింగ్ టిఫిన్‌గా ఇడ్లీ తింటే ఎన్ని ప్రయోజనాలో!

by Jakkula Samataha |
మార్నింగ్ టిఫిన్‌గా ఇడ్లీ తింటే ఎన్ని ప్రయోజనాలో!
X

దిశ, ఫీచర్స్ : ఉదయాన్నే టిఫిన్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మార్నింగ్ టిఫిన్ చేయడంలో కొందరికి కొన్ని అపోహలు ఉంటాయి. ఎలాంటి టిఫిన్ తింటే ఆరోగ్యానికి మంచిది. ఏ ఆహారం తీసుకోవాలని తెగ ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా కొంత మందికి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు. కానీ ఇదే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఉదయం టిపిన్‌గా ఇడ్లీ తినడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. అయినా కొంత మంది ఇడ్లీ తినడానికి ఇంట్రెస్ట్ చూపరు.

అయితే ఉదయం టిఫిన్‌గా ఇడ్లీ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

1. ఇడ్లీలో కేలరీలు తక్కువగా ఉండటం వలన దీన్ని తిన్నా బరువు పెరగరు, అలాగే దీనిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువలన ఇది శరీరానికి చాలా మంచిది.

2.ఇడ్లీలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అందువలన మార్నింగ్ టిఫిన్‌గా ఇడ్లీ తినడం వలన ఇది గుండె, కాలేయం పనితీరుకు చాలా మంచిదంట. అంతే కాకుండా ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందంట.

3.ఇడ్లీని పులియబెట్టి చేస్తారు కాబట్టి, ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యానికి చాలా అవసరం. పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఇవి మేలు చేస్తుంది.



Next Story

Most Viewed