వారెవా ఏం సెటప్ రా బాబు.. ఏకంగా లారీలోనే (వీడియో)

by Disha Web Desk 21 |
వారెవా ఏం సెటప్ రా బాబు.. ఏకంగా లారీలోనే (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : జీవితంలో పెళ్లి అనేది ఓ మంచి అనుభూతి. కాబట్టి పెళ్లి చేసుకునే వధూవరులు వారి పెళ్లిని ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకునేలా.. గ్రాండ్‌గా జరుపుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరు ఏం అనుకున్న డోంట్ కేర్.. తమకు నచ్చినట్టుగా పెళ్లి జరగాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో చిత్రవిచిత్ర సాహసాలు చేసి బంధువులను ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే ఇలాంటివి ఈ మధ్య కుప్పలు తెప్పలుగా వైరల్ అవడం చూసాం. ఇక తాజాగా అలాంటిదే మరో వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.

కొందరు వ్యక్తులు ఇంటి వద్ద లేద కళ్యాణ మండపంలో మ్యారేజ్ చేసుకుంటారు. కానీ, ఈ వీడియోలో కనిపిస్తోన్న వధూవరులు మాత్రం కొత్తగా ట్రై చేశారు. ఒక పెద్ద లారీలో కళ్యాణ మండపం వలే క్రియేట్ చేశారు. డిజైన్‌లతో తలుపులు.. ఆపై కలర్ ఫుల్ లైటింగ్‌తో వావ్ అనిపించారు. ఇక అందులోనే వధూవరులకు కూర్చుండబెట్టి హంగామా చేశారు. చివరికి భోజన ఏర్పాటు కూడా అందులోనే నిర్వహించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ క్రియేటివిటీ అచ్చం సినిమాను తలపించేలా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story