8 డేస్ లవర్స్‌కు పండుగే పండుగ.. కిక్ ఇచ్చేది ఆరోజే..!

by Disha Web |
8 డేస్ లవర్స్‌కు పండుగే పండుగ.. కిక్ ఇచ్చేది ఆరోజే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో ఎంతో మంది గొప్ప ప్రేమికులు ఉన్నారు. ప్రేమించిన వారితోనే జీవితాంతం కలిసి సంతోషంగా ఉన్న వారూ ఉన్నారు. అలాగే వారి ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసిన అమరప్రేమికులు ఉన్నారు. అలాంటి ప్రేమికులకు ఓ రోజు ఉంది. అదే వాలెంటైన్ డే. ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికులంతా ఎదురు చూసే రోజు. వాలెంటైన్స్ డేని దాన్ని ప్రతిసంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే అనేది ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు. సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి తన ప్రేమ కోసం ప్రాణత్యాగం చేశాడు. అంతటి ప్రేమికున్ని స్మరించుకుంటూ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వాలెంటైన్ డేని ప్రారంభంలో యూఎస్ఏ, యూకేలలో మాత్రమే జరుపుకునేవారు. కానీ ఈ రోజుల్లో దీన్ని ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుపుకుంటారు. అయితే వాలెంటైన్ డే కంటే వారం ముందునుంచే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు ప్రేమికులు. దాన్నే వాలెంటైన్ వీక్ అంటారు. అంటే ఫిబ్రవరి 7 నుంచే ప్రేమికులు సెలబ్రేషన్స్‌ని మొదలు పెట్టి ప్రేమలో ఉండే మాధుర్యాన్ని ఆస్వాధిస్తారు. మరి వాలెంటైన్స్ వీక్‌లో ఏ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకుందామా.

వాలెంటైన్ వీక్ లిస్ట్

ఫిబ్రవరి 7వ తేదీ : రోజ్ డే

ఫిబ్రవరి 8వ తేదీ : ప్రపోజ్ డే

ఫిబ్రవరి 9వ తేదీ : చాక్లెట్ డే

ఫిబ్రవరి 10వ తేదీ : టెడ్డీ డే

ఫిబ్రవరి 11వ తేదీ : ప్రామిస్ డే

ఫిబ్రవరి 12వ తేదీ : హగ్ డే

ఫిబ్రవరి 13వ తేదీ : కిస్ డే

ఫిబ్రవరి 14వ తేదీ : వాలెంటైన్ డే (లవర్స్ డే)

రోజ్ డే, ఫిబ్రవరి 7

ఈ రోజున ప్రతి ప్రేమజంట తమ ప్రేమని ఎర్ర గులాబీ పువ్వు ఇచ్చుకుంటూ వ్యక్తపరుస్తుంటారు. ఇద్దరు వ్యక్తులు తమ మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచడానికి గులాబీ పువ్వును ఇస్తారు. ఎన్ని ముల్లున్నా తమ జీవితం గులాబీలా అందంగా సాగిపోవాలని, గులాబీ పువ్వంత స్వచ్ఛమైన ప్రేమను పంచుతామని తమ ఫీలింగ్‌ని వ్యక్తపరుస్తారు.


ప్రపోజ్ డే, ఫిబ్రవరి 8

ఈ రోజున తాను ప్రేమించిన వ్యక్తిని తనలో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. జీవితాంతం తనను ప్రేమగా చేసుకుంటానంటూ ప్రపోజ్ చేస్తారు.


చాక్లెట్ డే , ఫిబ్రవరి 9

అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎంతో ఇష్టమైంది చాక్లెట్. ఫిబ్రవరి 9న తమ ఫేవరేట్ చాక్లెట్ ని ప్రేయసికి కానీ ప్రియుడికి ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరిచే స్పెషల్ డే. ఏ పండుగైన తియ్యదనంతో మొదలు పెట్టాలంటారు కదా. అందుకే ప్రపోజ్ డే అయిన మరుసటి రోజు తమ లవర్‌కి చాక్లెట్ ఇచ్చి నోరు తీపి చేస్తారు.


టెడ్డీ డే, ఫిబ్రవరి 10

అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే వాటితో టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి. ఈ రోజున ప్రియుడు తన ప్రేయసికి టెడ్డీ గిఫ్ట్‌గా ఇస్తాడు. తాను ఎంత దూరంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా టెడ్డీని చూస్తేచాలు ఏదో ఆనందం కలగాలని ప్రజెంట్ చేస్తాడు. ఈ బహుమతి మీ భాగస్వామిని నవ్వేలా చేస్తుంది.


ప్రామిస్ డే, ఫిబ్రవరి 11

కష్టసుఖాల్లో జీవితాంతం తోడు ఉంటానని, ఎలాంటి కష్టం కలగకుండా కంటికి రెప్పలా చూసుకుంటానని తమ భాగస్వాములు ఈ రోజున ప్రామిస్ చేస్తారు. తనతో జీవితం పంచుకునే వారికి ప్రామిస్ చేసి తమపై నమ్మకాన్ని కలిగించుకుంటారు.


హగ్ డే, ఫిబ్రవరి 12

హగ్ డే రోజు రోజు ప్రేమికులు తమ ప్రేమను కౌగిలింత ద్వారా వ్యక్తపరుస్తుంటారు. కౌగిలి అనేది మానవ సంబంధాలలో అన్యోన్యతను, ప్రేమ, అభిమానాన్ని సూచిస్తుంది. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం చెబుతుంది.


కిస్ డే, ఫిబ్రవరి 13

తమలో దాచుకున్న ప్రేమను ముద్దు ద్వారా ప్రేమికులు వ్యక్తపరుస్తుంటారు. అనురాగం, గౌరవం, ప్రేమను ముద్దుతో చూపిస్తారు. ప్రేమ జంటలు ఈ రోజు ముద్దు పెట్టుకోవడం ఓ ప్రత్యేకతగా భావిస్తారు.


వాలెంటైన్స్ డే, ఫిబ్రవరి 14

వాలెంటైన్స్ డే. ఈ రోజు ప్రేమికులకు ఎంతో ముఖ్యమైన రోజు, ఒక పండగ. ప్రేమ జంటలు, ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలు ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే వారం మొత్తం వాలెంటైన్ వీక్ జరుపుకున్నా లేకున్నా ఈ రోజును మాత్రం కచ్చితంగా జరుపుకుంటారు.Next Story