- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Uric acid : ‘యూరిక్ యాసిడ్’తో బాధపడుతున్నారా.. ? వీటిని తింటే సమస్య దూరం!
దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మూత్ర విసర్జన సమయంలో భరించలేని మంటతో కొందరు అవస్థలు పడుతుంటారు. నిజానికి శరీరంలో ప్యూరిన్ పెరగడం వల్ల ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే మూత్రంలో మంటను తగ్గించడంలో కొన్ని రకాల పండ్లు తినడం కూడా సహాయపడుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
* యాపిల్ : అద్భుత పోషక గుణాలు కలిగిన పండ్లల్లో యాపిల్ ఒకటి. ఇందులో ఫైబర్ కంటెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రోజుకు ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే యాపిల్స్‌లో ఉండే ‘మాలిక్ యూరిక్’ మూత్రంలో ఆమ్లగుణాలతో వచ్చే మంటను నియంత్రిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
* స్ట్రా బెర్రీలు : వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. యూరిక్ ఆమ్లాన్ని, మంటను నివారించడంలో సహయాపడతాయి. అలాగే వీటిలోని ఫ్లేవనాయిడ్లు యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేయడంతో పాటు ఆరోగ్యానికి అనేక విధాలా మేలు చేస్తాయి.
* పైనాపిల్ : ఈ పండు రోజూ తింటే మూత్రంలో మంట సమస్య దూరం అవుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటంవల్ల కూడా మేలు జరుగుతుంది. కిడ్నీల ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెప్తున్నారు.
* నారింజ : విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా యాటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా నారింజలో ఉంటాయి. వీటిని అప్పుడప్పుడూ తినడంవల్ల యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.